Monday, December 23, 2024

గిరిజన’బంధు’

- Advertisement -
- Advertisement -

ఎస్‌టి రిజర్వేషన్లు 10శాతానికి పెంచుతూ వారంలో ఉత్తర్వులు

త్వరలో పోడు భూములకు పట్టాలు, రైతుబంధు
దళితబంధు తరహా గిరిజనబంధు
ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో
సిఎం కెసిఆర్ చరిత్రాత్మక ప్రకటనలు

మన తెలంగాణ/హైదరాబాద్ : గిరిజనుల రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై కేంద్రాన్ని అడిగి అడిగి విసిగిపోయాం.. విసిగి పోదల్చుకోలేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన జీవోను రాష్ట్ర ప్రభుత్వమే వారం రోజులో జారీ చేసి అమలు చేస్తుందని ప్రకటించారు. దీనిని అమలు చేసి ప్రధా ని నరేంద్రమోడీ గౌరవం కాపాడుకుంటారో? లేదంటే దానినే ఉరితాడు చేసుకుంటారో ఆయన ఇష్టమని సిఎం అల్టిమేటం జారీ చే శారు. అలాగే రాష్ట్రంలో దళితబంధు తరహాలోనే భూమిలేని నిరుపేద గిరిజనులకు ఇంటికి రూ. 10 లక్షల ఇచ్చి ఆదుకునే ‘గిరిజన బంధు’ అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గిరిజన గురుకులాలను మరిన్ని పెంచుతామని తెలిపిన సిఎం.. సంవత్సరం నుంచే గిరిజన బాలికలకు గురుకులాలు తెచ్చే యోచన ఉందన్నారు. గిరిజనులకు పోడు భూముల పట్టాలు కూడా ఇస్తామని చరిత్రాత్మక ప్రకటన చేశారు. శనివారం నగరంలోని ఎన్‌టిఆర్ స్టే డియంలో ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభ జరిగింది. ఈ సభ కు రాష్ట్రం నలుమూలల నుంచి గిరిజనులు ఆదివాసీలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఈ సం దర్భంగా కుమ్రం భీం, సంత్ సేవాలాల్ విగ్రహాలకు సిఎం కెసిఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గిరిజనులను ఆదివాసీలను ఉద్దేశించి కెసిఆర్ ప్రసంగిస్తూ, రా ష్ట్రంలో గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు విషయంలో కేంద్రాన్ని ప లుమార్లు అడిగి విసిగిపోయామన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్ర భుత్వం ఎంతో ఓపికగా ఎదురుచూసిందన్నారు. ఇక వేచి చూడలేమన్నారు. మా గిరిజన బిడ్డల రిజర్వేషన్ సంగతి మేమే చూసుకుంటామన్నా రు. వారం రోజుల్లోనే రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించిన జీవోను జారీ చేస్తామన్నారు. ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు గిరిజన జాతి 6 శాతం రిజర్వేషన్లు పొందిందన్నారు. ఆ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చే సి కేంద్రానికి పంపామన్నారు. అ యితే ఏడు సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆయన తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పలుమార్లు మోడీ ని కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ ఫ లితం లేకుండా పోయిందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంతో సంబం ధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పది శా తం రిజర్వేషన్ బిల్లును అమలు చేస్తుందన్నారు. కాగా గిరిజన సమస్యలు పరిష్కారం అయ్యేందుకు నూతనంగా నిర్మించిన ఆదివాసీ, బంజారా భవన్‌లను వేదికలను సద్వినియోగం చేసుకోవాలని కెసిఆర్ సూచించారు. ఇందుకు గిరిజనుల సమస్యల పరిష్కారానికి శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగుదామన్నారు.

మీకేం అడ్డు వస్తోంది

విభజన రాజకీయాలు మొదలు పెట్టిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను అడుగుతున్నా.. రిజర్వేషన్ బిల్లు ఆమోదిం చడానికి మీకేం అడ్డం వస్తుందని కెసిఆర్ ప్రశ్నించారు. ఆ బిల్లును అసలు ఎందుకు ఆపుతున్నారని నిలదీశారు. రాష్ట్రపతిగా కూడా ఆదివాసీ బిడ్డనే ఉన్నారన్నారు. ఆమె కూడా బిల్లును ఆపకపోవచ్చునన్న ధీమా వ్యక్తం చేశారు. బిల్లును రాష్ట్రపతి ఆమోదం చేసి పంపిస్తే ఐదు నిమిషాల్లో జీవో విడుదల చేస్తామన్నారు. దీంతో రాష్ట్రంలో బ్రహ్మాండంగా రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. గిరిజనులకు ఎంతో ప్రయోజనకారిగా ఉన్న బిల్లును ఎందుకు తొక్కిపెడుతున్నారని కేంద్రం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రా జ్యాంగంలో ఎక్కడా కూడా 50 శాతానికి రిజర్వేషన్లు మించవద్దని చెప్పలేదన్నారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని ఈ సందర్భంగా కెసిఆర్ గుర్తు చేశారు. పక్క రాష్ట్రంలో అమలు అవుతున్నప్పడు…. మరి తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మీకు ఎందుకు చేతులు రావడం లేదని మోడీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ఇప్పటికైనా చేతులు జోడించి మోడీని అభ్యర్థిస్తున్నానని…. వెంటనే గిరిజన బిల్లుకు రాష్ట్రపతి ముద్ర వేసి పంపించండి అని కోరుతున్నానని కెసిఆర్ అన్నారు.

త్వరలోనే గిరిజన బంధు

రాష్ట్రంలో త్వరలోనే గిరిజన బంధు అమలు చేస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించారు. పోడు భూముల సమస్య పరిష్కారం కాగానే గిరిజన బంధుపై ఆలోచన చేస్తామన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారిగా కమిటీలు వేసుకునేందుకు ఇటీవల ప్రత్యేకంగా జీవో 140ను జారీ చేసిందన్నారు. ఈ మేరకు త్వరలోనే కమిటీలన్నీ సమావేశమై నివేదికలిస్తే పోడు భూములకు పట్టాలిస్తామన్నారు. అలాగే పోడు భూములకు రైతుబంధు కూడా ఇస్తామని కెసిఆర్ వెల్లడించారు. పోడు భూములపై మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ గిరిజన శాసనసభ్యులు, ఎంపీలు కూర్చున్న మీటింగ్‌లో చెప్పానని అన్నారు.

పోడు భూములు పంచిన తర్వాత అసలు భూములు లేకుండా ఉన్న గిరిజనులెవరో చూద్దామని చెప్పానని అన్నారు. ఆ జాబితాను త్వరగా తెప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఇప్పటికే ఆదేశించానని కెసిఆర్ తెలిపారు. ఆ లిస్ట్ ఒకసారి రాగానే గిరిజనబంధు కూడా స్టార్ట్ చేయబోతున్నామన్నారు. భూమిలేకుండా, భుక్తి లేకుండా, ఏ ఆధారం లేకుండా ఉండే గిరిజనబిడ్డలకు సైతం గిరిజనబంధును కూడా తన చేతులతో ప్రారంభిస్తానని హామీ ఇస్తున్నా. వెలుసుబాటు కూడా చూసుకొని ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. సాధించుకున్న స్వరాష్ట్రంలో కులం, జాతి, మతం అనే బేధం లేకుండా అందరం అన్నదమ్ముళ్లా మనం కలిసి జీవించాలన్నారు.

మరోసారి కల్లోల్లానికి గురి కావొద్దు

తెలంగాణ కోసం జాతి కులం మతం అనే బేధం లేకుండా 58 ఏండ్లు పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించామని కెసిఆర్ అన్నారు. ఒక రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు సమస్యలు సంభవిస్తాయన్నారు. కానీ రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన హక్కులు ఇవ్వకుండా మోడీ ప్రభుత్వం విద్వేష విభజన రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. మనకు వచ్చే న్యాయమైన హక్కు అడుగుతున్నామన్నారు. ఈ దేశంలో 8 సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం ఏ వర్గం ప్రజలకైనా మంచి పని చేసిందా? అని ప్రశ్నించారు. మనం కూడా ఈ దేశంలో భాగమే కదా? ఎందుకు హక్కులు ఇవ్వడం లేదని నిలదీశారు. పేదల ప్రజల ఉసురు పోసుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం సంకుచితమైన పెడధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు.

విద్వేష రాజకీయాలను బద్దలు కొట్టాలే

దేశంలో కొనసాగుతున్న విద్వేష రాజకీయాలను బద్దలు కొట్టాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. దేశం కొంత పుంతలు తొక్కాలన్నారు. ప్రజారాజ్యం, రైతుల రాజ్యం రావాలని అభిలాషించారు. దేశ నదుల్లో ప్రవహించే నీరు సముద్రం పాలుకాకుండా రైతుల పంటపొలాల్లోకి రావాలన్నారు. తెలంగాణలో జరిగే ప్రయత్నమే భారతదేశమంతా జరగాలన్నారు. ఖచ్చితంగా తెలంగాణ జాతిగా భారత రాజకీయాలను ప్రభావితం చేయాలన్నారు. అవసరమైన సందర్భంలో ఏవిధంగా అయితే తెలంగాణ కోసం పోరాటం చేశామో….అదే విధంగా దేశంలో జరిగే మతపిచ్చి కలహాలను, కుట్రలను, విద్వేష రాజకీయాలను కూకటివేళ్లతో పెకలించాలన్నారు. దీని ప్రతి ఒక్కరు తమ వంతుగా ముందడుగు వెయ్యాలన్నారు. మహత్ముడు సాధించిన భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని ముందుకు పోవాలన్నారు. అది పౌరులుగా మన కర్తవ్యమని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు.

మతపిచ్చి మనకు అంటుకుంటే….

కొందరు దుర్మార్గులు, నీచ రాజకీయ నాయకులు వారి సంకుచిత స్వార్థం కోసం చెలరేగొట్టే మత పిచ్చి మనకు అంటుకుంటే మనం ఎటుకాకుండా పోతామని కెసిఆర్ హెచ్చరించారు. అందుకే మీ బిడ్డగా… తెలంగాణ సాధించిన వ్యక్తి ఈ గడ్డ మట్టిలో పుట్టిన వ్యక్తిగా మీ అందరికీ చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నానని అన్నారు. విద్యావంతులు, మేథావులు, బుద్ధిజీవులు ఎక్కడికక్కడ ప్రజలను అప్రమత్తం చేసి సమాజానికి కాపలాదారులుగా ఉండాలని సిఎం కెసిఆర్ సూచించారు. చిన్న పొరపాటు కారణంగా సుమారు ఆరు దశాబ్దాలు గోసపడ్డమని కెసిఆర్ అన్నారు. మంచినీళ్లకు, కరెంటు, ఉద్యోగానికి వలసలు పోయామన్నారు. 20 ఎకరాలున్న రైతు హైదరాబాద్‌లో ఆటోలు నడిపారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బతుకు ఈ సమైక్య రాష్ట్రంలో బొంబాయి దుబాయి బొగ్గుబాయి అన్నట్లు అయ్యిందన్నాకుయ రాష్ట్రం వస్తే బాగుపడుతాం అని చెప్పామని…అది ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నామన్నారు. పేదలకు పట్టెడు అన్నం పెట్టుకుంటున్నామని ఆయన తెలిపారు.

గురుకులాలను మరిన్ని పెంచుతాం

రాష్ట్రంలో గురుకులాల సంఖ్యను మరింత పెంచుతామని కెసిఆర్ తెలిపారు. గిరిజన ఆడ బిడ్డలు బాగా చదువుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో గిరిజన గురుకులాలు ఈ సంవత్సరం మంజూరు చేసుకునే ఆలోచన చేస్తున్నామన్నారు. బాలికలు, బాలుర కోసం ఏ ఒక్కరు చదువురాకుండా ఉండకుండా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. విద్యావంతులైన గిరిజన బిడ్డలు ఎక్కడ ఉన్నారు? అంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారన అనే పేరు, కీర్తి, ప్రతిష్ట సాధించాలని హృదయపూర్వకంగా కోరుతున్నానని కెసిఆర్ అన్నారు. ఎంతో కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఏవిధమైన కార్యక్రమాలు, ప్రజా సంక్షేమం జరుగుతుందో అందరూ కళ్లారా చూస్తున్నారన్నారు. సంపద పెంచడం, అవసరమైన పేదలకు పెంచడమే మన సిద్ధాంతమని సిఎం పేర్కొన్నారు. గిరిజన గురుకులాల విద్యార్థులు 200 మంది డాక్టర్లు, వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ చూపిన వారంతా ఈ సభలో ఉన్నారన్నారు. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. మీరు ఇంకా బంగారు బిడ్డలు, తెలంగాణ బిడ్డలుగా ఈ భారత జాతి ప్రతినిధులుగా ఎదగాలని అభిలాషించారు. మీ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎంత డబ్బైనా ఖర్చు పెడుతుందని కెసిఆర్ స్పష్టం చేశారు.

అన్ని రంగాల్లోనూ అగ్రగామి

కఠోరమైన దీక్ష, క్రమ శిక్షణ, అవినీతిరహితంగా ప్రభుత్వాన్ని నడుపుకుంటూ అన్ని రంగాలను ప్రోత్సహిస్తూ ముందుకు కదిలిపోతున్నామని కెసిఆర్ అన్నారు. మీ అందరి ఆశీర్వచనంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హామీలు పాలసీలు విజయవంతమై పారిశ్రామిక, ఐటి, ఉద్యోగ కల్పన రంగం, వ్యవసాయరంగం దేశంలోనే అగ్రగామిగా ముందుకుపోతున్నామన్నారు. దేశంలో 24గంటల పాటు అన్ని వర్గాలకు కరెంటు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రంగా వెలుగొందుతున్నామన్నారు. తెలంగాణ సమాజం ఐక్యత ప్రగతి పరుగులు ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోవద్దు అని అన్నారు.

కేంద్రం ఒక్కటైనా మంచి పని చేసిందా?

ఎనిమిదేళ్ల పాలనలో కేంద్రం ఒక్క మంచి పనైనా చేసిందా? అని సిఎం కెసిఆర్ ప్రశ్నించారు. మనకు రావాల్సిన న్యాయమైన హక్కులనూ ఇవ్వడం లేదని ఆరోపించారు. దేశంలో ఎన్నో సమస్యలున్నాయన్నారు. విపరీతమైన ప్రకృతి సంపద ఉందన్నారు. నదుల్లో పుష్కలంగా నీరు ఉందన్నారు. కావాల్సినంత కరెంటు అందన్నారు. అయినప్పటికీ ప్రజలకు అవి అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కేంద్ర అసమర్థ పాలనేనని మండిపడ్డారు. రాష్ట్రాన్ని సాధించిన ఎనిమిది సంవత్సరాల్లో తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకపోతుంటే….దేశం ఎందుకు ముందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. స్వరాష్ట్రంలో మన చేతుల్లో ఉన్న అధికారాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నామన్నారు. కాబట్టి సాధించుకున్నామన్నారు. దాన్ని బతకనివ్వకుండా ప్రతి బోరుకు పెట్టాలని…. ముక్కు పిండి ప్రజల వద్ద పైసలు వసూలు చేయాలని కేంద్రం రాష్ట్రాలపై అనేక ఆంక్షలు విధిస్తోందని కెసిఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలానే మోడీ అనేక విషయాల్లో సులభంగా పరిష్కరించే విషయాల్లో తాత్సారం చేస్తూ దేశాన్ని ప్రజలను గాలికి వదిలేస్తున్నారని ధ్వజమెత్తారు. తమకు ఇష్టమైన వ్యక్తులు కోటీశ్వరులకు షావుకార్లకు దేశ సంపదను దోచిపెడుతూ ప్రైవేటైజేషన్ పేరిట లక్షల కోట్ల ప్రజల ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపించారు.

చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతా

సమాజాన్ని శాంతి, సుఖంతో సర్వమానవ సౌభాతృత్వంతో బ్రహ్మాండంగా పురోగమించే దిశగా తీసుకోపోయేదాంట్లో తన చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తానని కెసిఆర్ వెల్లడించారు. దీని కోసం నిరతంరం ప్రజల పక్షాన ఉంటానన్నారు.తాడిత పీడిత ప్రజల కోసం ఈ దేశంలోని యావత్ అణచివేయబడ్డ జాతుల కోసం తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అటువంటి అంబేద్కర్‌ను సమున్నతంగా గౌరవించేవిధంగా తెలంగాణ ప్రధాన పరిపాలనమైనటువంటి సచివాలయానికి అంబేద్కర్ పేరును పెట్టుకున్నామన్నారు. ఈ రకంగా అన్నివర్గాలను గౌరవించుకుంటూ అందరం కలిసి ఆనందంగా సంతోషంగా అన్ని సంస్కృతులు పండుగలు జాతర్లను గొప్పగా నిర్వహించుకుంటున్నామన్నారు. ఆడుతూ పాడుతూ ఈ సమాజం శాంతియుతంగా ముందుకు సాగాలన్నారు. అదే నా గుండెలనిండ ఉన్న కోరిక అని కెసిఆర్ పేర్కొన్నారు. దేవుడు ఇచ్చిన శక్తిని వినియోగించి మీ సేవలో రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి అభ్యుదయం గురించి పని చేస్తానని అన్నారు. రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన మీ అందరికి పేరుపేరునా ధాన్యవాదాలు, రాం రాం, జైహింద్, జై తెలంగాణ అని పేర్కొంటూ సిఎం కెసిఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.

తండాల్లో విష జ్వరాలు లేవు….ఆకలి చావులు లేవు

గిరిజన సోదరుల కోసం తండాలను పంచాయతీలుగా చేశామని కెసిఆర్ అన్నారు. తండాలు, ఆదివాసీ గూడెంలలో వారే పరిపాలించుకుంటున్నారన్నారు. వారికి 3 ఫేజుల కరెంట్ ఇస్తున్నామన్నారు. గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. విదేశాల్లో చదివే ఎస్‌టి విద్యార్థులకు రూ. 20 లక్షల ఓవర్సీస్ పేరుతో ఉపకార వేతనాలను అందిస్తున్నామని కెసిఆర్ వెల్లడించారు. అలాగే మిషన్ భగీరథ ద్వారా తండాలకు, గూడెంలకు మంచినీరు అందిస్తున్నామన్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో ఇచ్చే నీళ్లే ఆదిలాబాద్ గూడెల్లో అచ్చంపేట చెంచు గూడాల్లో కూడా అందిస్తున్నామన్నారు. ఇపుడు తండాల్లో విషజ్వరాలు లేవు. ఆకలి చావులు లేవని కెసిఆర్ స్పష్టం చేశారు.

అందరికీ కడుపు నిండా అన్నం పెడుతున్నామన్నారు. అందరికీ అన్ని పథకాలు అందుతున్నాయన్నారు. మహారాష్ట్ర నుంచి 20 మంది వచ్చి, మీరు పెట్టే జాతీయ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. మీరు ముందుకు ఉండి పోరాడాలని విజ్ఞప్తి చేశారు.మావా నాటే, మావా రాజ్ (మా తండాలో మా రాజ్యం) అని దశాబ్దాలుగా గిరిజన సోదరులు కోరుతున్నారన్నారు. దీనిని ఎవరు పట్టించుకోలేదన్నారు. కానీ టిఆర్‌ఎస్ పార్టీ గత ఎన్నికలపుడు చెప్పిన విధంగా 3 వేల పైచిలుకు గిరిజన తండాలు, గూడేలను పంచాయతీలుగా చేశామన్నారు. గిరిజనుల ప్రత్యేక సంస్కృతిని కాపాడుతున్నామన్నారు. గిరిజన పండుగలు, జాతరలను ప్రభుత్వమే వందల కోట్లతో నిర్వహిస్తున్నదన్నారు. స్వరాష్ట్రం వచ్చింది కాబట్టే మనం ఇవన్నీ చేసుకుంటున్నామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News