ఎస్‌బిఐ, ఐసిఐసిఐలో ఎంత అవసరం?
న్యూఢిల్లీ : ప్రతి బ్యాంకులో ఖాతాదారులు కనీస బ్యాలెన్స్‌ను తప్పనిసరిగా నిర్వహించాలి. బ్యాంకులు తమ ఖాతాదారులకు పొదుపు ఖాతా కనీస బ్యాలెన్స్‌పై అనేక రకాల సౌకర్యాలను అందిస్తాయి. అయితే ఈ సౌకర్యాలతో పాటు కస్టమర్‌లు కొన్ని ముఖ్యమైన నియమాలు, నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యమైనది పొదుపు ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించడం, ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలి. ప్రతి బ్యాంకు కనీస సగటు బ్యాలెన్స్ నియమాన్ని నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే, బ్యాంకు అతని నుండి పెనాల్టీని వసూలు చేస్తుంది.
ప్రతి వ్యక్తి కనీసం తన ఖాతాలో ఉంచుకోవాల్సిన మొత్తం కనీస బ్యాలెన్స్ బ్యాంకు ఆధారంగా మారుతూ ఉంటుంది. ఖాతాలో కనీస బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది. దేశంలోని రెండు పెద్ద బ్యాంకులు అంటే ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), ఐసిఐసిఐ బ్యాంక్ తమ కస్టమర్ల కోసం వేర్వేరు మినిమమ్ బ్యాలెన్స్ మొత్తాన్ని నిర్ణయించాయి. రెండు బ్యాంకులకు కోట్లాది మంది ఖాతాదారులు ఉన్నారు. రెండు బ్యాంకుల ఈ నియమాల గురించి తెలుసుకుందాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఎస్‌బిఐ కనీస బ్యాలెన్స్ రూల్స్ తన ఖాతాలలోని ప్రాంతం ప్రకారం నిర్ణయించారు. ఖాతా సెమీ అర్బన్ ఏరియా బ్రాంచ్‌లో ఉన్నట్లయితే, మీరు తప్పనిసరిగా కనీసం రూ. 2,000 ఖాతాలో ఉంచుకోవాలి. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల ఖాతాదారులకు కనీస నిల్వ మొత్తం రూ.1,000. మరోవైపు మెట్రో నగరానికి చెల్లించాలంటే ఈ మొత్తాన్ని రూ.3వేలుగా నిర్ణయించారు.
ఐసిఐసిఐ బ్యాంక్
ఐసిఐసిఐ బ్యాంక్ ప్రాంతం ప్రకారం కనీస బ్యాలెన్స్ మొత్తాన్ని కూడా నిర్ణయించింది. అర్బన్ లేదా మెట్రో సిటీలో ఖాతా ఉంటే తప్పనిసరిగా కనీసం రూ. 10,000 బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాలి. సెమీ అర్బన్‌లో ఈ మొత్తం రూ. 5,000, గ్రామీణ ప్రాంతాల్లో ఈ మొత్తం కనీసం రూ. 2,500 ఉండాలి. లేని పక్షంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.