Monday, November 25, 2024

ఉత్తర్ ప్రదేశ్ లో ప్రతి 3 గంటలకో బలాత్కారం: ఎన్ సిఆర్ బి

- Advertisement -
- Advertisement -

 

NCRB

లక్నో: దేశంలోనే అత్యధిక జనాభా వున్నరాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖీంపూర్‌ఖేరీ జిల్లాలోని తమ్మోలిన్‌పుర్వా గ్రామంలో పట్టపగలు ఇద్దరు దళిత బాలికలను అపహరించి, మానాభంగం చేసి, చెట్టుకు వ్రేలాడదీసిన క్రూరమైన ఘటన మొదటిదేమి కాదు. జాతీయ నేర రికార్డుల బ్యూరో(ఎన్‌సిఆర్‌బి) 2021 రికార్డు ప్రకారం ప్రతి మూడు గంటలకో మానభంగం జరిగే రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్. ‘మహిళా శక్తి మిషన్’, ‘బేటీ బచావో’ వంటి ఎన్నో ప్రచారాలు చేస్తూ ఎంత చంకలు గుద్దుకున్నా, యూపి ముఖ్యమంత్రి ‘మహిళా భద్రత’ అంటూ డబ్బాలు కొట్టుకున్నా… శుక్రవారం(సెప్టెంబర్ 16) రాత్రి ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో పేద బాలిక బలైంది.నిందితులను అరెస్టు చేసి వారిపై 304ఐపిసి సెక్షన్ బుక్ చేశారు.

భీర పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు అదో ఈవ్ టీజింగ్ కేసని, చిన్న గొడవకు చెందిన కేసని కొట్టిపారేశారు. వాస్తవానికి ఇద్దరు యువకులు బాహాటంగా ఓ పేద బాలికను ఆమె ఇంటి నుంచే ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ వారి యత్నం ఫలించలేదు. ఆ బాలిక తల్లి అడ్డుపడ్డంతో వారు ఆమెను నిర్దాక్షిణ్యంగా చావబాదారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో నిర్భయ కేసు కూడా ఎలాంటి ప్రభావం చూపలేదు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏ ప్రభుత్వం వచ్చినా మహిళలపై మానభంగాలు అడ్డుఅదుపులేకుండా కొనసాగుతున్నాయి. అక్కడ పోలీసులు అవినీతిపరులు కావడంతో న్యాయం జరగడంలేదు. పైగా రాజకీయ ప్రోద్బలం కూడా ఉంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News