న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ , బిజెపిపై దాడిపై ధ్వజమెత్తారు. ఓటమి భయంతో అవినీతికి వ్యతిరేకంగా పోరాడే నెపంతో “తప్పుడు” కేసులు పెట్టి ‘ఆప్’ ని అణచివేసేందుకు ప్రయత్నించారని విమర్శించారు. ఇక్కడ జరిగిన ఆప్ యొక్క ఎన్నికైన ప్రతినిధుల జాతీయ సమ్మేళనంలో కేజ్రీవాల్ ప్రసంగించారు. “గుజరాత్‌లో ఆప్‌కి పెరుగుతున్న ప్రజాదరణను బిజెపి జీర్ణించుకోలేకపోతోంది” అని పేర్కొన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడుతూ, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం పేరుతో ఢిల్లీలో తమ చట్టసభ సభ్యులపై 169 “తప్పుడు” కేసులు నమోదు చేసిందని, అయితే ఏ ఒక్క కేసులోనూ ఒక్క దోషిని కూడా నిరూపించలేకపోయిందని అన్నారు. 135 కేసుల్లో తమ పార్టీకి చెందినవారు నిర్దోషులని తేలిందన్నారు.
“గుజరాత్‌లో ఆప్‌కి కవరేజీ ఇవ్వవద్దని ప్రధాని సలహాదారు హిరేన్ జోషి అనేక టివి ఛానల్ యజమానులను ,వారి సంపాదకులను హెచ్చరించారు, తీవ్ర పరిణామాలతో వారిని బెదిరించారు… అలాంటి పనులు చేయడం ఆపండి. ఒకవేళ ఈ సంపాదకులు జోషి సందేశాల స్క్రీన్‌షాట్‌లను పంచుకుంటే, ప్రధాని, అతని సలహాదారు- ఇద్దరూ తమ ముఖాలను దేశానికి చూపించే స్థితిలో ఉండరు”అని కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్‌లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ఆయన, దేశంలోని 20 రాష్ట్రాల్లో ఇప్పుడు ఆప్‌కి 1,446 మంది ప్రజా ప్రతినిధులు ఉన్నారని, ఇందులో ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, పంచాయతీ సభ్యులున్నారన్నారు. ‘‘నిజాయితీ లేని వ్యక్తి, అవినీతిపరుడు, దేశద్రోహి మాత్రమే ఉచితాలు దేశానికి మేలు చేయవని… దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుందని రాజకీయ నాయకుడు ఎవరైనా చెబితే, అతని ఉద్దేశాలు తప్పు’’ అని ఆయన అన్నారు.
बंद करो मीडिया को धमकी देना। ऐसे देश कैसे तरक़्क़ी करेगा? pic.twitter.com/3XbeoyrAfR
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 18, 2022