- Advertisement -
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో నేడు ( సోమవారం) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మంగళ, బుధవారాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రం వైపు గాలులు వాయువ్య దిశ నుంచి వీస్తున్నాయని పేర్కొన్న వాతావరణశాఖ.. ఈ నెల 20న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని స్పష్టం చేసింది. మూడు రోజుల పాటు ఒడిశా తీర ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, పశ్చిమబెంగాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించారు. అల్పపీడనంతో 3 రోజులపాటు కోస్తాంధ్ర, యానాం, తెలంగాణలో ఉరుములు, మెరుపులతో జల్లులు పడే అవకాశం ఉందన్నారు.
- Advertisement -