వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో క్వీన్ ఎలిజబెత్-II అంత్యక్రియలను చూసేందుకు సెంట్రల్ లండన్‌లో రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు భారీ జనసమూహం వరుసకట్టింది.
లండన్: బ్రిటన్ దేశస్థులు, ప్రపంచవ్యాప్త దేశాధినేతలు, నమ్మకస్తులు బ్రిటన్ రాణి రెండవ ఎలిజబెత్ కు చివరి విడ్కోలు పలికారు. ఆమె ఈ యుగానికి చెందిన ఓ మహోన్నత వ్యక్తి. రాణి అంత్య క్రియాల్లో పాల్గొనడానికి వేలాది మంది రాత్రికిరాత్రే లండన్ చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం), ఇంపీరియల్ స్టేట్ క్రౌన్‌తో రాయల్ స్టాండర్డ్ జెండాతో కప్పబడిన ఓక్ శవపేటిక అంత్యక్రియల కోసం నావికాదళ సిబ్బంది వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేకి తీసుకొచ్చింది.
అంత్యక్రియలకు హాజరైన ప్రముఖులలో దాదాపు 500 మంది ప్రపంచ నాయకులు ఉన్నారు. వీరిలో మిస్టర్ బైడెన్, జపాన్ చక్రవర్తి నరుహిటో, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, చైనా వైస్ ప్రెసిడెంట్ వాంగ్ కిషన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఉన్నారు. రాణి మునిమనవరాళ్లు, ప్రిన్స్ జార్జ్ (9) , ప్రిన్సెస్ షార్లెట్ (7) ప్రస్తుత సింహాసనం వారసుడు ప్రిన్స్ విలియం, ఆయన ఇద్దరు పెద్ద పిల్లలు కూడా హాజరు అయ్యారు. క్వీన్ ఎలిజబెత్ -II తన 96వ ఏట సెప్టెంబర్ 8న ఆమె స్కాటిష్ సమ్మర్ హోమ్- బాల్మోరల్ కాజిల్‌లో మరణించింది.
The Abbey’s tenor bell has begun tolling once a minute for 96 minutes, reflecting the years of HM Queen Elizabeth’s life. The tenor bell is the largest of the Abbey’s ten bells and is traditionally tolled upon the death of a member of the Royal Family. pic.twitter.com/0oZjU9tVAI
— Westminster Abbey (@wabbey) September 19, 2022