Monday, January 20, 2025

నిషాపై దాడి జరగలేదు

- Advertisement -
- Advertisement -

Everything is fake in Nisha's case

విజయ్‌ను ఇరికించేందుకు ప్లాన్ వేసిన నిషా
పోలీసుల దర్యాప్తులో బయటపడ్డ నిజం
ఆస్పత్రి నుంచి డిఛార్జ్

మనతెలంగాణ, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ పిఏ తనపై కత్తితో దాడి చేశాడని హంగామ సృష్టించిన నిషా కేసులో అన్ని ఫేక్‌గా పంజాగుట్ట పోలీసులు తేల్చారు. కావాలనే ఆమె విజయ్ సింహాపై ఆరోపణలు చేసిందని తేల్చారు. నిషా అనే మహిళ తనపై జూబ్లీహిల్స్ ఎమ్మెలేయ మాగంటి గోపీనాథ్ పిఏ విజయ్‌సింహా కత్తితో దాడి చేసి గాయపర్చాడని ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తర్వాత యశోద ఆస్పత్రిలో చేరింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆస్పత్రిలో ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకుని నిషా ఇంటి సమీపంలోని సిసిటివి పుటేజ్‌ను పరిశీలించారు. సిసిటివిలో విజయ్ సింహా వచ్చినట్లు లేకపోవడంతో కావాలనే విజయ్‌ను కేసులో ఇరికించేందుకు నిషా నాటకం ఆడినట్లు పోలీసులు తేల్చారు.

ఆ సమయంలో కూకట్‌పల్లిలో ఉన్నానుః విజయ్ సింహ

తాను ఎమ్మెల్యే వద్ద పిఏగా పనిచేయడంలేదని, విజయ్ సింహ తెలిపారు. తనను ఇబ్బంది పెట్టేందుకే నిషా నాటకం ఆడుతోందని ఆరోపించారు. నిషా తనపై దాడి జరిగినట్లు చెబుతున్న సమయంలో కూకట్‌పల్లిలో ఉన్నానని తెలిపారు. తప్పు చేస్తే జైలుకు పోవడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News