Sunday, December 22, 2024

శ్రీవిష్ణు సినిమాల్లో కొత్తదనం ఉంటుంది

- Advertisement -
- Advertisement -

హీరో శ్రీవిష్ణు ప్రతిష్టాత్మక చిత్రం ’అల్లూరి’. ఈ చిత్రంతో ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బెక్కెం బబిత సమర్పిస్తున్నారు. ఈనెల 23న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ “శ్రీవిష్ణు చేసే సినిమాల్లో కొత్తదనం వుంటుంది. ఆయన ప్రతి సినిమా విజయం సాధించి, ఇంకా మంచి స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ “అల్లూరి కథని ఐదేళ్ళుగా నమ్మి ఇక్కడి వరకూ తీసుకొచ్చాం. దీనికి ప్రధాన కారణం మా దర్శకుడు ప్రదీప్ వర్మ. ఇది చాలా వైవిధ్యమైన పోలీస్ స్టొరీ. ఇరవై ఏళ్ళ లైఫ్ టైం ని ఈ కథలో చాలా అద్భుతంగా చూపించబోతున్నాం. నాది ఫిక్షనల్ క్యారెక్టర్. కానీ సంఘటనలు మాత్రం అన్నీ నిజంగా జరిగినవే”అని తెలిపారు. నిర్మాత బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ “ఈ సినిమాను ఎక్కడ రాజీపడకుండా నిర్మించాము. చాలా మంచి కంటెంట్ వున్న సినిమా ఇది”అని చెప్పారు. చిత్ర దర్శకుడు ప్రదీప్ వర్మ మాట్లాడుతూ “కొన్ని సంఘటనలని కుదించి ఒక పోలీస్ ఆఫీసర్ బయోపిక్‌లా చేశాం. అల్లూరి… చాలా కిక్ ఇచ్చే సినిమా”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కయ్యదు లోహార్, ప్రశాంత్ వర్మ, తేజ మార్ని, శ్రీ హర్ష, రాజ్ తోట, రాంబాబు గోసాల, తనికెళ్ళ భరణి, చదలవాడ శ్రీనివాస్, రామసత్యనారాయణ పాల్గొన్నారు.

Allu Arjun Speech at Alluri Movie Pre Release

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News