Monday, November 25, 2024

అంద‌రి “బంధు” వు కెసిఆర్‌: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

హైద‌రాబాద్‌: సిఎం కెసిఆర్ అంద‌రి బంధువు అని, సబ్బండ వ‌ర్గాల‌కు సాయంగా ఉన్నారని, అన్ని కులాలు, మ‌తాలు, వ‌ర్గాలు, ప్ర‌జ‌లు, ప్రాంతాల‌కు అతీతంగా అంద‌రి కోసం సిఎం ప‌ని చేస్తున్నారని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. సిఎం కెసిఆర్ గారు చెప్పిన‌ట్లు త్వ‌ర‌లోనే గిరిజ‌నుల‌కు 10శాతం రిజ‌ర్వేష‌న్లు, గిరిజ‌న బంధు ప‌థ‌కం అమ‌లు అవుతుందని స్పష్టం చేశారు. సిఎం కెసిఆర్ మాట త‌ప్ప‌రు. మ‌డ‌మ తిప్ప‌రని, ఆయ‌న మాట అంటే మాటే అని, క‌చ్చితంగా చేస్తారని, ఆయ‌న‌కు మ‌నం అండ‌గా ఉండాలని పిలుపునిచ్చారు. ఆయ‌న లాంటి సిఎం మ‌న‌కు దొర‌క‌రు అని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు చెప్పారు. సిఎం కెసిఆర్ ఇటీవ‌ల చేసిన‌, గిరిజ‌నుల‌కు 10శాతం రిజ‌ర్వేష‌న్లు, గిరిజ‌న బంధు ప్ర‌క‌ట‌న ప‌ట్ల మంత్రి ఎర్ర‌బెల్లికి కృత‌జ్ఞ‌త‌లు తెల‌ప‌డానికి పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం నుండి హైద‌రాబాద్ కు త‌ర‌లి వ‌చ్చిన గిరిజ‌న నేత‌లు, ప్ర‌జాప్ర‌తినిధులు, ఎంపిపిలు జెడ్పిటిసిలు, స‌ర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ముఖ్య నాయ‌కులు,గ్రామ పార్టీ అధ్య‌క్షులు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావుగారికి కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు తెల‌ప‌డానికి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా వారంద‌రినీ ఉద్దేశించి మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడారు.

గిరిజ‌నుల‌కు 10శాతం రిజర్వేష‌న్ల కోసం ఆరు సంవత్సరాల క్రితమే అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే కేంద్రం ఆ బిల్లును క‌నీసం ప‌ట్టించుకోలేద‌ని మండిపడ్డారు. కొద్ది రోజుల క్రితం ఆ బిల్లే త‌మ వ‌ద్ద‌కు రాలేద‌ని బుకాయించార‌ని, చివ‌ర‌కు వ‌చ్చింద‌ని చెప్పార‌ని, ఈ ప‌రిస్థితుల్లో కేంద్రం ఉంటే ఎలా? అని మంత్రి వాపోయారు. ఇటీవ‌ల గిరిజ‌న‌, ఆదివాసీ ఆత్మ‌గౌర‌వ సంత్ సేవాలాల్‌, కుమ‌రం భీం భ‌వ‌నాల‌ను హైద‌రాబాద్ లో ప్రారంభించిన స‌మ‌యంలో సిఎం, కేంద్రానికి గ‌ట్టిగా చెప్పార‌ని, కేంద్రం కాద‌న్నా, మన రాష్ట్రంలో గిరిజ‌నుల కోసం 10శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే ద‌ళిత బంధు లాగే, గిరిజన బంధు ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తామ‌ని చెప్పిన సిఎం కెసిఆర్ కు మ‌న‌మంతా కృత‌జ్ఞ‌త‌తో, అండ‌గా ఉండాల‌ని చెప్పారు. దేశంలో ఇలాంటి సిఎంలు లేర‌ని, ప్ర‌జ‌లంద‌రి కోసం ఆలోచిస్తున్న సిఎం మ‌న‌మంతా కృత‌జ్థ‌లు ధ‌న్య‌వాదాలు తెలపాల‌న్నారు. సంద‌ర్భాలు వ‌చ్చిన‌ప్ప‌డు మ‌నమంతా అండ‌గా నిల‌వాల‌ని గిరిజ‌న ప్ర‌తినిధులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు విజ్ఞ‌ప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News