Saturday, November 23, 2024

ప్రపంచం లోనే తొలిసారి క్లోనింగ్‌తో ఆర్కిటిక్ తోడేలు సృష్టి

- Advertisement -
- Advertisement -

Arctic wolf created by cloning for first time in world

చైనాలో క్లోనింగ్ “మాయా”

బీజింగ్ : ప్రపంచంలోనే తొలిసారి క్లోనింగ్ విధానంతో ఆర్కిటిక్ తోడేలును బీజింగ్ లోని ఓ సంస్థ సృష్టించింది. ఆర్కిటిక్ తోడేలును సాధారణంగా పోలార్ ఉల్ఫ్, లేదా వైట్ ఉల్ఫ్ అని పిలుస్తారు. ఇవి ఎక్కువగా కెనడా పరిధి లోకి వచ్చే క్వీన్ ఎలిజెబెత్ ద్వీపంలో కనిపిస్తాయి. అంతరించిపోతున్న అరుదైన జీవ జాతులను క్లోనింగ్ ద్వారా కాపాడటంలో చైనా విజయం ఓ మైలురాయిగా భావిస్తున్నారు. ఈ క్లోనింగ్ తోడేలు వంద రోజుల తరువాత వీడియో ద్వారా బాహ్య ప్రపంచం ముందుకు వచ్చింది. బీజింగ్ లోని సినోజీన్ బయోటెక్నాలజీ కోసంస్థ ల్యాబ్‌లో క్లోనింగ్ చేశారు. ఈ ఏడాది జూన్ 10న ఈ తోడేలు జన్మించింది. దీనికి మాయా అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఇది ఆరోగ్యంగా ఉంది. “మాయా” జన్మకు ఉపయోగించిన క్లోనింగ్ కణం ఓ ఆర్కిటిక్ తోడేలు చర్మం నుంచి సేకరించారు. ఈఆడ తోడేలును కెనడా నుంచి హెర్బిన్ పోలార్ ల్యాండ్ సంస్థకు అప్పగించారు. మాయా సరోగేట్ తల్లిజీవి బీగిల్ జాతి కుక్కగా కంపెనీ పేర్కొంది. అంతరించిపోతున్న ఈ జంతువులను కాపాడేందుకు మేము హర్బిన్ పోలార్ ల్యాండ్ సంస్థతో కలిసి 2020 నుంచి పనిచేస్తున్నాం. రెండేళ్ల కృషితో ఆర్కిటిక్ తోడేలును విజయవంతంగా క్లోనింగ్ చేశాం. ప్రపంచంలో ఇలా చేయడం ఇదే తొలిసారి” అని సినోజీన్ కంపెనీ జీఎం మి జిడాంగ్ పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News