కీవ్: రష్యా అధీనంలో ఉన్న దక్షిణ ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలు రష్యాలో చేరేందుకు రిఫరెండం నిర్వహించనున్నారు. రష్యాలో చేరికపై ఈవారంలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఓటింగ్ నిర్వహిస్తున్నట్లు మంగళవారం వేర్పాటువాద నాయకులు ప్రకటించారు. మాస్కో ప్రారంభించిన యుద్ధంలో భూభాగాలు రష్యాలో భాగమైనందును ఈ వారం చివరి నుంచి ఓట్లను నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిపారు.క్రెమ్లిన్ మద్దతు ఉన్న నాలుగు ప్రాంతాలు మాస్కోలో వేదిక పంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్ బలగాలు తమ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు తీవ్రంగా రష్యా బలగాలను ప్రతిఘటిస్తున్నాయి.
శుక్రవారం నుంచి డోనెట్స్, లుహాన్స్, ఖెన్స్రన్, పాక్షికంగా రష్యా నియంత్రణలో ఉన్న జాపోరిజ్జియా ప్రాంతాల్లో రిఫరెండం ప్రారంభం కానుంది. ఏడు నెలల క్రితం ప్రారంభమైన యుద్ధంలో మాస్కో ఈ ప్రాంతాన్ని కోల్పోయింది. ఉక్రెయిన్ తమ ప్రాంతాలను రష్యా బలగాలనుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ సూచన మేరకు రిఫరెండం నిర్వహిస్తున్నట్లు మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్ తెలిపారు. కాగా డోనెట్స్‌ప్రాంత అధిపతి డెనిస్ పుషిలిన్ మాట్లాడుతూ దీర్ఘకాలంగా ఈ ప్రాంత ప్రజలకు తమ మాతృభూమిగా భావించే రష్యా దేశంలో భాగమయ్యే హక్కు ఉందన్నారు. మిలియన్ల రష్యన్ ప్రజలు ఎదురుచూస్తున్న చారిత్రాత్మక న్యాయాన్ని పునరుద్ధరించడానికి ఓటు సహాయపడుతుందన్నారు.