Wednesday, November 27, 2024

మునుగోడు అభ్యర్థిపై కసరత్తు

- Advertisement -
- Advertisement -

నల్లగొండ జిల్లా
నేతలతో సిఎం
కెసిఆర్ భేటీ
నేతల అభిప్రాయాలు
తెలుసుకుంటున్న
ముఖ్యమంత్రి
త్వరలో అభ్యర్థి
పేరు వెల్లడి

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రగతి భవన్‌లో సీఎం కెసిఆర్ తో మంత్రి జగదీష్ రెడ్డి, మునుగోడు మాజీ ఎంఎల్‌ఎ కూసుకుంట్ల ప్ర భాకర్ రెడ్డి మంగళవారం నాడు భే టీ అయ్యారు. మునుగోడు ఉప ఎ న్నికల్లోఅనుసరించాల్సినవ్యూ హం పై చర్చించారు. కాంగ్రెస్, బిజెపి నుంచి బలమైన అభ్యర్థులు బరిలో కి నిలుస్తుండటంతో వారికి ధీటుగా ఎవరిని నిలబెడదామనే అంశంపై కెసిఆర్ నాయకుల నుంచి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. రె డ్డి సామాజిక వర్గం నుంచి అభ్యర్థి ని నిలబెట్టాలా? బిసిల నుంచి నిలబెట్టాలా? అనే అంశంపై కూలంకషంగా చర్చించారు. అభ్యర్థి పేరు ను త్వరలోనే ప్రకటించబోతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అధికార పార్టీ టికెట్ ఆశిస్తున్నవారు ఎక్కువగా ఉండటంతో ఎవరి పేరు అనే విషయమై కెసిఆర్ అభిప్రాయాలు తీసుకుంటున్నారు. కాగా, మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల ప్ర భాకర్ రెడ్డి అభ్యర్ధిత్వం వైపే కెసిఆర్ మొగ్గు చూపుతున్నారనే ప్రచా రం లేకపోలేదు.

కూసుకుంట్ల ప్ర భాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వవద్దని ఆ యన వ్యతిరేక వర్గం కోరుతుంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వవద్దని గతంలో అసమ్మతివాదులు డిమాండ్ చేశారు. దీంతో అ సంతృప్తి వ్యక్తం చేసిన వారందరిని మంత్రి జగదీష్ రెడ్డి సీఎం కెసిఆర్ వద్దకు తీసుకు వచ్చారు. అభ్యర్ధి ఎ వరైనా గెలుపు కోసం ప్రయత్నిస్తామని అసమ్మతి నేతలు చెప్పారు. అ యితే సిఎం కెసిఆర్‌తో సమావేశం ముగిసిన వారం రోజుల్లోపుగానే అసమ్మతివాదులు సమావేశం ని ర్వహించి ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వవద్దని డిమాండ్ చేశారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం తమకు ఇవ్వడం లేదని గత మాసంలో మాజీ ఎంపిబూర నర్సయ్యగౌడ్ తెలిపారు. తనతో పాటు మాజీ ఎంఎల్‌సి కర్నె ప్రభాకర్ కు కూడా సమాచారం ఇవ్వడం లేదన్నారు. అయితే ఈ విషయమై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. మాజీ ఎంపి బూర నర్సయ్యగౌడ్ మాటల్లో తప్పు లేదన్నారు.పార్టీ కార్యక్రమాల గురించి ఎందకు సమాచారం రావడం లేదో సమీక్షించుకొంటామని కూడా మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు.

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పరిస్థితిని గమనించిన పార్టీ నాయకత్వం అసంతృప్తివాదులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్ధిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దివంగత మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధిగా ప్రకటించింది. బిజెపి అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. టిఆర్‌ఎస్ మాత్రం ఇంకా అభ్యర్ధిని ప్రకటించలేదు. మునుగోడులో ఇప్పటికే టిఆర్‌ఎస్ నేతలకు పార్టీ నాయకత్వం బాధ్యతలను అప్పగించింది. హుజూరాబాద్, దుబ్బాకలో వచ్చిన ఫలితాలను దృష్టిలో ఉంచుకొని ఆ తరహ ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు టిఆర్‌ఎస్ చీఫ్ కెసిఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత నెల 4వ తేదీన కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు.. గత నెల 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. గత నెల 21న కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఆరు మాసాల్లోపుగా ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్థానంలో విజయం కోసం కాంగ్రెస్, టిఆర్‌ఎస్, బిజెపిలు కేంద్రీకరించి పని చేస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు సిపిఐ, సిపిఎంలు మద్దతు ప్రకటించాయి.ఈ అసెంబ్లీ స్థానంలో లెఫ్ట్ పార్టీలకు మంచి ఓటు బ్యాంకు ఉంది. బిజెపిని ఓడించాలనే ఉద్దేశ్యంతో టిఆర్‌ఎస్ కు మద్దతివ్వాలని నిర్ణయం తీసుకున్నామని లెఫ్ట్ పార్టీలు ప్రకటించాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News