హైదరాబాద్: ఏఐ, మెషీన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్‌లో ప్రత్యేకత కలిగిన డీప్‌టెక్ కంపెనీ స్పాట్‌ఫ్లోక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్‌ఫర్మేషన్ సర్వీసెస్(ఇన్కోయిస్)తో అవగాహన ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా సముద్ర సమాచారం, సలహా సేవలను డీప్ టెక్ వినియోగించి అందించడంతో పాటుగా పలు పరిశ్రమలలో అంచనాల పరంగా ఖచ్చితత్త్వం మెరుగుపరచనుంది.
ప్రపంచవ్యాప్తంగా ఓషన్ ఇండస్ట్రీస్, ప్రభుత్వ శాఖలు డీప్ టెక్ టూల్స్ అయిన డాటా ప్రాసెసింగ్ టూల్స్, డాటా విజువలైజేషన్స్, బిజినెస్ ఇంటిలిజెన్స్, ఏఐ–మెషీన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్, బ్లాక్ చైన్, ఐఓటీ వినియోగిస్తున్నాయి. భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇప్పుడు ఓషన్ సేవలు, మోడలింగ్, అప్లికేషన్స్, రిసోర్శెస్, టెక్నాలజీ (ఓ–స్మార్ట్) పథకం అమలు చేస్తోంది.
స్పాట్‌ఫ్లోక్ సీఈఓ, కో–ఫౌండర్ శ్రీధర్ శేషాద్రి మాట్లాడుతూ ‘‘మహోన్నతమైన సంస్ధ అయిన ఇన్కోయిస్‌తో అవగాహన ఒప్పందం చేసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. సీఎన్‌ఎన్ ఆధారిత నమూనాలపై ఆధారపడి సంభావ్య ఫిషింగ్ జోన్ సమాచారం సేకరించడం, సముద్ర జంతువులపై వాతావరణ మార్పుల ప్రభావం, జీవజాలం వలసపోయే మార్గాలను కనుగొనడం వంటివి చేయనున్నాము’’ అని అన్నారు.
INCOIS Collaborates with Spotflock