Thursday, December 19, 2024

క్రికెట్‌లో కొత్త నిబంధనలు

- Advertisement -
- Advertisement -

ICC makes Changes before T20 World Cup 2022

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త నియమ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. క్రికెట్‌లో అమలు చేసే కొత్త నియమాల గురించి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) మంగళవారం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. సౌరవ్ గంగూలీ సారథ్యంలోని పురుషుల క్రికెట్ కమిటీ చేసిన సిఫార్సులను ఐసిసి అత్యున్నత కమిటీ ఆమోదించింది. ఈ క్రమంలో తీసుకున్న మార్పులను ఐసిసి వెల్లడించింది. ఎంసిసి 2017 క్రికెట్ కోడ్ చట్టాల మూడో విడత సవరణల గురించి గంగూలీ నేతృత్వంలోని కమిటీ చర్చించి ఐసిసికి ప్రతిపాదనలను సమర్పించింది. ఈ ప్రతిపాదనల గురించి మహిళల క్రికెట్ కమిటీతో కూడా చర్చించారు. ఇక ఐసిసి అమలు చేసే కొత్త నిబంధనలు అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి. వచ్చే నెలలో అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు ఈ విధంగా ఉన్నాయి. బ్యాటర్ క్యాచ్ అవుట్ అయితే..స్ట్రయికర్ ఉన్న స్థానంలోకే కొత్త బ్యాట్స్‌మన్ వస్తాడు. క్యాచ్ పట్టే సమయంలో బ్యాట్స్‌మన్ ఒకరినొకరు క్రాస్ చేసినా దాన్ని పరిగణలోకి తీసుకోరు. గతంలో ఇలాంటి పట్టింపులు ఉండేవికావు. ఇకపై బంతికి ఉమ్మిని రాయడంపై పూర్తిస్తాయి నిషేదం విధించారు.

ఇకపై బంతికి ఉమ్మిని రాయడం కుదరదు. టెస్టుల్లో, వన్డేల్లో ఇన్‌కమింగ్ బ్యాట్స్‌మన్ రెండు నిమిషాల్లోనే స్ట్రైక్ తీసుకోవడానికి సిద్ధం కావాల్సి ఉంటుంది. అయితే టి20 విషయంలో పాత నిబంధనలే అమల్లో ఉంటాయి. బౌలింగ్ చేస్తున్న సమయంలో ఫీల్డింగ్‌లో ఏదైనా ఉద్దేశపూర్వకకమైన కదలికలు చోటు చేసుకుంటే ఆ బాల్‌ను డెడ్ బాల్‌గా ప్రకటిస్తారు. అంతేగాక బ్యాటింగ్ జట్టుకు ఐదు పరుగులను పెనాల్టీ రూపంలో ఇచ్చే వెసులుబాటు అంపైర్‌కు కల్పించారు. ఇక టి20లో ప్రవేశ పెట్టిన మ్యాచ్ పెనాల్టీని వన్డేల్లోనూ అమలు చేయనున్నారు. దీని ప్రకారం నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోతే ఆ మిగిలిన ఓవర్లలో బౌండరీ దగ్గర నుంచి 30 యార్డ్ సర్కిల్‌లోకి ఫీల్డర్‌ను తీసుకు రావాల్సి ఉంటుంది. దీంతో పాలు మరికొన్ని కొత్త నిబంధనలను కూడా రానున్న రోజుల్లో ఐసిసి ఆయా ఫార్మాట్‌లలో అమలు చేయనుంది.

ICC makes Changes before T20 World Cup 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News