హైదరాబాద్: నోపార్కింగ్‌లో కారు నిలిపిన మహిళ చలాన్ విధించిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై హంగామా సృష్టించింది. తన కారుకే ఫైన్ వేస్తావా అంటూ కానిస్టేబుల్ చేతిలో ఉన్న వాకీటాకీను లాక్కుని వాగ్వాదానికి దిగింది. సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నోపార్కింగ్ ఏరియాలో మహిళ కారును నిలిపింది. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి చలాన్ విధించారు. కారుకు చలాన్ విధించడాన్ని మహిళ తప్పు పట్టింది. తన కారుకు చలాన్ ఎలా విధిస్తారని వాగ్వాదానికి దిగింది. దీంతో పోలీసులు కారును ట్రాఫిక్ పెట్రోలింగ్ వాహనానికి కట్టుకుని తరలించేందుకు యత్నించారు. మహిళా హంగామా చేయడంతో పోలీసులు ఎసిపి అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీస్ తనిఖీలు చేస్తుండగా సుల్తాన్ బజార్ లోని"నో"పార్కింగ్ స్థలంలో కారు పార్కింగ్ చేసిన మహిళ "నో" పార్కింగ్ స్థలంలో కారు పార్కింగ్ ఉండడంతో కార్ విల్ కు లాక్ వేసి చలాన్ వేసిన ట్రాఫిక్ పోలీసులు ఏ విధంగా చలన్ వేస్తారు అంటూ వాగ్వాదం. pic.twitter.com/akS82rDB8D
— Sai vineeth(Journalist🇮🇳) (@SmRtysai) September 21, 2022