మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో బాగంగా జూబ్లీహిల్స్ లో నటి కావ్య కళ్యాణ్ రామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నటి కావ్య మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని లక్ష లాది మొక్కలు నాటడం అందులో చిన్న, పెద్ద మరియు సెలబ్రిటీలు సామాన్యులు అనే తేడా లేకుండా అందరిని భాగస్వామ్యం చెయ్యడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. రాబోయే తరాలకు మంచి వాతావరణం లభించాలంటే ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన ఎంపి సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మసుధ మూవీ టీమ్ అందరూ మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరారు.
చిలుకూరి బాలాజీ ఆలయ ప్రాంగణంలో…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా చిలుకూరి బాలాజీ ఆలయ ప్రాంగణంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర మహిళ విభాగ్ జమ్మి మొక్కలు నాటారు. గుడికి ఒక జమ్మి చెట్టు -ఊరుకు ఒక జమ్మి చెట్టు అనే నినాదంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళ విభాగ్ ఆధ్వర్యంలో చిలుకూరి బాలాజీ ఆలయ ప్రాంగణంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ప్రథమ మహిళ ఉప్పల స్వప్న జమ్మి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర మహిళ విభాగం అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మి, జనరల్ సెక్రటరీ లంకెలపల్లి మంజుల, ఐవిఎఫ్ చీఫ్ అడ్వైజర్ మణిమాల, సలహాదారులు శైలజ, అనిత, ఐవిఎఫ్ మహిళ నాయకురాళ్లు, తదితరులు పాల్గొన్నారు.