- Advertisement -
హైదరాబాద్: ఎవరి సొమ్ముతో ఎవరు సోకులు పడుతున్నారో చెప్పాలని బిజెపి ఎంపి కె లక్ష్మణ్‌ను మంత్రి కెటిఆర్ నిలదీశారు. తెలంగాణ సొమ్ముతో లక్ష్మణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గరీబు ఉత్తర ప్రదేశ్ సోకులు పడుతోందని చురకలంటించారు. దేశాభివృద్ధికి తెలంగాణ దోహదపడుతున్నందుకు ధన్యవాదాలు చెప్పాలన్నారు. లక్ష్మణ్ లెక్కలు తెలుసుకోవాలని, అంతే కానీ ప్రజలను మభ్యపెట్టకండని సూచించారు. కరువు పీడిత నేలగా ఉన్న తెలంగాణ… 1.35 కోట్ల ఎకరాల మాగాణంగా ఎలా మారిందని బిజెపోళ్లను ప్రశ్నించారు. నాడు నెర్రలు బారిన నేల నేడు పచ్చదనంతో కళకళలాడుతోందన్నారు. రైతు బంధు, 24 గంటల విద్యుత్‌తో వ్యవసాయం కొత్తపుంతలు తొక్కుతోందని కెటిఆర్ ప్రశంసించారు.
- Advertisement -