అశోక్ గెహ్లాట్‌కు పరోక్ష హెచ్చరిక
ఎర్నాకుళం(కేరళ): ‘ఒకరికి ఒకే పోస్ట్’ అనే నియమాన్ని రాహుల్ గాంధీ మరోసారి బలపరిచారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అశోక్ గెహ్లాట్‌ను ఉద్దేశించి ఆయన “ఒక వ్యక్తి రెండు పాత్రలు పోషించడం కుదరదు” అన్నారు. “ఉదయ్‌పూర్‌లో మేము ఈ కట్టుబడి చేసుకున్నాము. దానిని కొనసాగిస్తారని నేను నమ్ముతున్నాను” అని ఆయన కేరళలో వివరించారు.
71ఏళ్ల అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గాంధీ కుటుంబ సభ్యుల అండవుందని తెలుస్తోంది. అదే సమయంలో ఆయన రాజస్థాన్ ముఖ్యమంత్రి పాత్రను కొనసాగించడం మాత్రం వారికి ఇష్టం లేదు. ఒకవేళ ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసేటట్లయితే ఆయన స్థానంలో సచిన్ పైలట్ వస్తారన్న భయం ఆయనకు ఉంది. తిరుగుబాటుదారైన ఆయన 2020లో దాదాపు అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూలదోసేంత పనిచేశారు.
ఈ ఏడాది మొదట్లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ‘ఒకరికి ఒకే పదవి’ అనే నియమాన్ని కాంగ్రెస్ ఆమోదించింది. నాడు ఆ మూడు రోజుల సమావేశంలో పార్టీ అంతర్గత సంస్కరణల గురించి, ఎన్నికల గురించి తీర్మానం చేయడం జరిగింది.
నిన్ననే సోనియాగాంధీని కలిసిన అశోక్ గెహ్లాట్‌కు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఓ దెబ్బ అనిపిస్తోంది. రాహుల్ గాంధీ “ఎవరైనా సరే కాంగ్రెస్ అధ్యక్షులవుతారో వారికి నేనిచ్చే సలహా ఒక్కటే. వారు పార్టీ ఆదర్శాలు, విధానం, భారత్ విజన్ మనస్సులో పెట్టుకుని మెలగాలి”అన్నారు.
Ernakulam: Rahul Gandhi on Thursday hinted that the Congress will adhere to the ‘one man one post’ as per the Udaipur declaration. When asked, “I think we have made a commitment in Udaipur and hope that it will be fulfilled,” he said. The statement comes as a big relief for Sachi pic.twitter.com/A77JTvR0Nx
— Deccan News (@Deccan_Cable) September 22, 2022