Monday, November 25, 2024

వ్యవసాయాన్ని కూడా ప్రైవేటుపరం చేస్తామనడం దారుణం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

KTR

హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి సర్కారుపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కెటిఆర్ గురువారం మరోమారు ధ్వజమెత్తారు. దేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగాన్ని కూడా ప్రైవేటుపరం చేస్తామని కేంద్రం ప్రకటన చేయడం దారుణమన్నారు. ధాన్యం సేకరణ వల్ల నష్టం వస్తోంది గనుక దానిని ప్రైవేటుపరం చేస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సుధాంషు పాండే బుధవారం చేసిన ప్రకటనను ఈ సందర్భంగా కెటిఆర్ ప్రస్తావించారు.

కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే…ఇక రైతులకు ఉచిత విద్యుత్ అనేదే దక్కదన్నారు. రైతులకు ఇస్తున్న రాయితీలు ఎత్తివేసేందుకే కేంద్రం విద్యుత్ సంస్కరణలను ముందుకు తెస్తోందని ఆరోపించారు. విద్యుత్ సంస్కరణలు అమల్లోకి వస్తే నష్టపోయేది తెలంగాణ రైతాంగమేనని ఆయన అన్నారు. ఈ సంస్కరణలు అమలు అయితే రైతులకు ఉచిత విద్యుత్ ఉండబోదని, తమ పొలంలో రైతులు తామే కూలీలుగా మారిపోతారని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News