మహిళా ఆర్ధిక స్వాలభనే ప్రభుత్వ లక్ష్యం : మేయర్ విజయలక్ష్మి
బతుకమ్మ విశ్వవ్యాప్తం: మంత్రి తలసాని
హైదరాబాద్: నగరంలో బతుకమ్మ చీరల పంపిణీ మరింత ఊపందుకుంది. గ్రేటర్ వ్యాప్తంగా శుక్రవారం చీరల పంపిణీ కొనసాగింది. బతుకమ్మ ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానుండడంతో ఎక్కడికక్కడ అధికారులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున చీరలను పంపిణీ చేస్తున్నారు. జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జూబ్లీహిల్స్ సర్కిల్‌లోని సిఎంటిఇసిలో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలను అందజేశారు. అదేవిధంగాపశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బన్సీలాల్ పేట లోని మల్టి పర్ఫస్ ఫంక్షన్ హాల్‌తో పాటు సనత్ నగర్ లోని వెల్ఫేర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
మహిళల ఆర్ధిక స్వాలభనే ప్రభుత్వ లక్షం: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
మహిళల ఆర్ధిక స్వాలభనే లక్షంగా అభివృద్ధికి పథకాలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారికి సముచిత స్థానాన్ని కల్పిస్తోందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు ఖైరతాబాద్ జోన్ లోని జూబ్లీహిల్స్ సర్కిల్ లో సి.ఎం.టి.ఇ.సిలో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ 2017 సంవత్సరం నుండి ప్రతి ఏడాది మహిళలకు బతుకమ్మ పండుగ చిరు కానుక గా 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ చీరలను పంపిణీ చేస్తోందన్నారు. నిరు పేదలు సైతం బతుకమ్మను ఆనందోత్సవాల తో జర్పుకోవలనే సంకల్పం తో ప్రభుత్వం ఖర్చుకు వెనకాడ కుండా చీరల పంపిణీకి శ్రీకారం చుట్టిందనితెలిపారు ఈ నెల 25వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు జరుపుకునే పండుగను మహిళలు సమిష్టిగా, సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రజనీ కాంత్ రెడ్డి. జిహెచ్‌ఎంసి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బతుకమ్మ విశ్వవ్యాప్తం: మంత్రి తలసాని
ప్రకృతిని ఆరాధిస్తూ ఆడపడుచులు జరుకునే బతుకమ్మ పండుగ నేడు విశ్వవ్యాప్తంగా కావడం మనకెంతో గర్వకారణమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారంబన్సీలాల్ పేట లోని మల్టి పర్ఫస్ ఫంక్షన్ హాల్‌తో పాటు సనత్ నగర్ లోని వెల్ఫేర్ గ్రౌండ్ లో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆదివారం నుంచి వచ్చెనెల 3వ తేదీవరకు 9 రోజుల పాటు జరిగే బతుకమ్మ ఉత్సవాలను పేద, మద్య తరగతి మహిళలు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలని ప్రభుత్వ తరపున చిరు కానుకగా చీరలను అందజేస్తున్నమన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఈ ఏడాది రూ. 340 కోట్ల వ్యయంతో తెలంగాణ వ్యాప్తంగా 1.18 కోట్ల చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
10 రకాల రంగుళ్లలో ౩౦ రకాల డిజైన్ లు 240 వైరైటీలతో నేతన్నలు తయారు చేసిన చీరలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. తద్వారా గతంలో బతుకు భారమైన చేనేత కార్మికులకు ప్రభుత్వం ఉపాధి కల్పిస్తోందని చెప్పారు. .ఈ ఏడాది సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో 52, 261 మందికి చీరలను పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణ పల్లెల్లో పుట్టి రాష్ట్రానికే పరిమితం అయిన బతుకమ్మ పండుగ నేడు విశ్వవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని, ఇది మనకెంతో గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు హేమలత, మహేశ్వరి, పద్మారావు నగర్ టిఆర్‌ఎస్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, కార్పొరేటర్ లు కోలన్ లక్ష్మి, సరళ, మాజీ కార్పొరేటర్ లు ఆకుల రూప, అత్తిలి అరుణ గౌడ్, ఉప్పల తరుణి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, రవికిరణ్, డిసిలు మోహన్‌రెడ్డి, ముకుంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.