Monday, December 23, 2024

అందుకే కోపం తెచ్చుకోను

- Advertisement -
- Advertisement -

That's why I don't get angry says MS dhoni

మహేంద్ర సింగ్ ధోనీ

న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌లోనే భారత మాజీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీకి మిస్టర్ కూల్ అనే పేరున్న విషయం తెలిసిందే. తీవ్ర ఒత్తిడిలోనూ భావోద్వేగాలను నియంత్రించుకుంటూ జట్టును ముందుకు నడిపించడంలో ధోనీకి ఎవరూ సాటిరారు. కాగా, మైదానంలో తాను ఎందుకు అంత కూల్‌గా కన్నిస్తానో ధోనీ వివరించాడు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. మైదానంలో ఉన్నప్పుడు ఎ లాంటి తప్పులు చేయొద్దని ప్రతి క్రికెటర్ అనుకోవడం సహాజమే. అది మిస్‌ఫీల్డ్ అయినా, క్యాచ్ చేజార్చడం అయినా కావొచ్చు. కానీ ఎంత జాగ్రత్తగా వ్యవహరించిన కొన్ని సార్లు పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ఆటగాళ్లు ఆ తప్పులు చేసినప్పుడు తాను వారి స్థానంలో ఉండి ఆలోచిస్తా. కేవలం కోపం తెచ్చుకోవడం వల్ల ఎలాంటి లాభం లేదని తనకు బాగా తెలు సు. ఇక వేలాది మంది అభిమానులు మైదానంలో కూర్చుని మ్యాచ్‌ను చూస్తుంటారు. టీవి ల్లో కోట్లాది మంది వీక్షిస్తుంటారు. వారి ముం దు తన సహచరుడు ఎవరైనా చులకన కావొద్దనేదే తన ఉద్దేశం. అందుకే సాధ్యమైనంత వర కు నా భావోద్వేగాలను నియంత్రించుకునేందు కు ప్రయత్నిస్తా. అందుకే తనకు మైదానంలో ఎప్పుడూ కూడా కోపం రాదని మిస్టర్ కూల్ కెప్టెన్ ధోనీ పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News