Monday, January 20, 2025

నవకల్పనలదే భవిష్యత్తు

- Advertisement -
- Advertisement -

new innovation is the future

‘Entrepreneurship doesn’t work like a regular job. Often, you will be required to do many jobs at once: product develo pment, sales, finance, HR. You cannot be shut away in your office crunching numbers and polishing your business masterplan; you have to be able to get out and talk to your customers, to see the bigger picture and identify what’s working and what isn’t’ –Sophie Coughlan (PR consultant & Freelance writer, London)
నవకల్పనలు ఏకరీతిన ఉండవు. వైవిధ్యభరితమైన ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటాయి. విభిన్న కౌశలాలనూ దశలనూ సంకల్పిస్తాయి. ఆధునిక యుగపు పూర్వాపరాలను చూస్తే ఒక్కో సందర్భంలో ఒక్కో శాస్త్రపరిధిలో జరుగుతూ వస్తున్న ఆవిష్కరణల తీరూ తెన్నూ ఈ రుజువులనే చూపుతున్నాయి. ఇదివరకటి కంటే ఎన్నడూ లేనంతగా ఇప్పుడు నవకల్పనల సొగసును సహకారాన్ని మానవాళి తనివితీరా ఆస్వాదిస్తోంది. టెక్నాలజీని ఆధారం చేసుకొని నాణ్యతా ప్రమాణాలు గీటురాయిగా, సార్వత్రిక మార్పులను ఆకళింపు చేసుకొన్న కంపెనీలు పరిశ్రమలు మార్కెట్‌ను శాసిస్తున్న వైనాన్ని మనం చూస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే మార్పు మాత్రమే స్థిరమైన ఈ ప్రపంచంలో సంస్థలకైనా, సమాజానికైనా మనుగడ అభివృద్ధి సాధనతోనే. అభివృద్ధికి అసలైన హామీ నవకల్పనలు, నూతన ఆవిష్కరణలే.

ఆపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రధాన కంపెనీలు ఆవిష్కరణల సామర్థ్యం కారణంగానే దినదిన ప్రవర్థమానం చెందాయన్న విషయం సుస్పష్టం. పారిశ్రామిక రంగంలో అభివృద్ధి ఎంత కీలకమో, సర్దుబాటు అనుకూలతలను మెరుగుపరచుకోవడం కూడా అంతే కీలకం. దీనినే కాలీనత అంటారు. కాలీనతను అలవరచుకునే స్వభావాన్ని కాలిక స్పృహ అంటారు. కాలిక స్పృహ లేకుంటే కోటాను కోట్ల పెట్టుబడి, వేలాది మంది శ్రామికుల స్వేదం వృథా కాగా వినియోగదారుల సంతృప్తికి తీరని అన్యాయం. దీనికి పరిష్కారం యువతను వ్యవస్థాపనల వైపుకు మళ్లించడమే. ఇదే సందర్భంలో విశ్వవిద్యాలయాలు నవకల్పనలపై ప్రకృష్టమైన శిక్షణ కూడా ఇవ్వాల్సి వుంది. ‘అత్యంత వినూత్న పరిశ్రమలు (Most Innovative Companies) -2022 జాబితాలోని యాభై సంస్థల్లో మన దేశానికి చెందిన ఏ ఒక్క కంపెనీకి చోటు దక్కకపోవడం చూస్తే మనం, మన పరిశ్రమల వస్తుసేవలు ఎంత తేలిక పాటివో అర్థమవుతుంది. అందుకని ఒక్క గుమస్తా ఉద్యోగానికి వేల సంఖ్యలో క్యూ కట్టే నిరుద్యోగులను కాకుండగా మెదడుకి పదునుపెట్టే వ్యవస్థాపకుల, ఆవిష్కర్తల తయారీపై ఉన్నత విద్యాసంస్థలు మరింత దృష్టి సారించాల్సుంది.
‘చైనా ఒకప్పుడు అనుకరణతో తనను తాను కాపాడుకుంది, ఇప్పుడు ఆవిష్కరణలతో ప్రపంచాన మేటిగా విస్తరిస్తుంది. రెండూ రాని ఇండియా వెనుకబడక ఏం చేస్తుంది’ ఇది ప్రముఖ ఇన్వెస్టర్ రాజేష్ సహానీ ఇటీవల చేసిన కామెంట్.

నా దృష్టిలో ఇది కంప్లైంటూ కాదు, ఎత్తిపొడుపూ కాదు. సృజనాత్మకతలో మన దేశం ఎక్కడుందో తెలుసుకోవడానికి పనికొచ్చే కొలమానం, అవగాహన. అయితే నవకల్పనలు, వ్యవస్థాపనల్లో మొదటిది వైయక్తిక మేధస్సుకు, రెండోది సామాజిక మేధస్సుకు చెందినవి. వ్యవస్థాపన విషయానికే వస్తే ‘In the case of entrepreneurs, the power of compelling goals that involve creating value for others influences their mindsets much more than creating wealth for themselves’ అంటూ ELI (The Entrepreneurial Learning Initiative) సంస్థ చెబుతున్న The five dimensions of an entrepreneurial mindset మన యువతకు అత్యావశ్యకం.

వీటిల్లో మొదటిది: ఉత్తమ స్వీయ దక్షత- విశ్వాసాలు (హై సెల్ఫ్ ఎఫికసి బిలివ్స్), రెండోది: నియంత్రణాంతర్గత స్థానం (ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్), మూడోది: ఎదుగుదల మనస్తత్వం (గ్రోత్ మైండ్ సెట్), నాల్గోది: స్వతసిద్ధమైన ప్రేరణ (ఇన్ట్రిన్సిక్ మోటివేషన్), ఐదోది: స్థితిస్థాపకతా శ్రేష్ఠతా స్థాయిలు (హైలెవెల్స్ ఆఫ్ రెజిలియెన్స్). వ్యాపారాన్ని స్వంతంగా ప్రారంభించడం, అభివృద్ధి చేయడం, నిర్వహించడమనే త్రిముఖ అభ్యాసం వ్యవస్థాపనకు ఆయువుపట్టు. ఇందుకు ప్రోత్సహం కల్పించే ఆలోచనా విధానమే వ్యవస్థాపక మనస్తత్వం. సమర్థులైన వ్యవస్థాపకుల జీవితాలను మనం పరిశీలిస్తే, సవాళ్లను, తప్పిదాలు, వైఫల్యాలను ఆగామి విజయాల కోసం, నూతన నైపుణ్యాల అభివృద్ధికై అవకాశాలుగా మలచుకున్నారని తెలుస్తుంది. నవ కల్పనావకాశాలను తమ మేధో బృందాలకు ఇచ్చారని, పోటీని సానుకూలంగా స్వీకరించి ప్రచారకళతో జనాభిమతాన్ని మళ్లించి తమ సంస్థలను ‘గుడ్ టు గ్రేట్’ గ్రంథంలో జిమ్ సి. కొల్లిన్స్ చెప్పినట్టు ‘మహాలోచన (వెల్-థాట్), సఫల ప్రణాళికలు (ఔట్ ప్లాన్స్), నిశిత వ్యూహాలు- ఎంపికలు (టఫ్ స్ట్రాటజిక్ ఛాయిసెస్), పునాది నుంచి నాయకత్వం (లెడ్ ఫ్రం ద గ్రాస్ రూట్స్ అప్)’ అనే నాలుగు యాజమాన్య నియమావళుల ద్వారా నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.

ప్రముఖ మేనేజ్ మెంట్ కన్సల్టెంట్, గ్రంథకర్త డేవిడ్ అలెన్ మనం తలపెట్టే పనులు పూర్తి అయ్యే విధానాన్ని గురించి మాట్లాడుతూ ‘మనసులో అనుకున్న పనికి, ప్రాక్టికల్‌గా జరిగే పనికి మధ్య విలోమత్వం ఉంటుంది’ అంటాడు. మరి, వ్యవస్థాపనా రంగం లో ఈ విలోమత్వాన్ని ఎట్లా అధిగమిస్తామనే దానికి సంబంధించిన తర్కమే ఎఫెక్టుయేషన్. పనులను సక్రమంగా నెరవేర్చే కళను ఎఫెక్టుయేషన్ అంటారు. ఇదే ఇంగ్లీషులో ‘ఆర్ట్ ఆఫ్ గెట్టింగ్ థింగ్స్ డన్’ అంటారు. ‘GTD (Getting Things Done) అనేది డేవిడ్ అలెన్ సూత్రీకరించిన పర్సనల్ ప్రొడక్టివ్ సిస్టమ్. ఈ రచన ఆంట్రెప్రెన్యూయర్లకు మంచి లెర్నింగ్ రిసోర్స్. ఇక్కడే ప్రముఖ వ్యాపారవేత్త స్టెఫే మేరీ మెక్ మహన్ చెబుతున్న ‘Resilience, tenacity, and motivation are the key starting points for anyone looking to develop an entrepreneurial mindset, అనే వ్యాఖ్యనూ యువతకు వివరించాలి. అట్లాగే ‘It is important to distinguish between key performance indicators (KPIs) and value drivers. An example of a value driver is growth and an example of a key performance indicator is market share’ అంటున్న IMD University ఆచార్యులు అట్రో బ్రిస్, క్రిస్టోస్ కొబలిస్ సూచననూ యువ ఇన్వెస్టర్లూ ఇన్నొవేటర్లూ అవపోసన పట్టాలి.

విద్యార్థులు భవిష్యత్తులో స్వంతంగా వ్యాపారాన్ని ఎవరైతే ప్రారంభించాలనుకుంటారో వాళ్లు తమ ఆలోచనా విధానానికి పదును పెట్టడం వారి జీవితంపై అపారమైన ప్రభావాన్ని చూపుతుందని, నేర్చుకుంటూ, ఎదుగుతూ, సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అమెరికన్ బిజినెస్ ఎక్జ్యూటివ్, వక్త, రచయిత కిం పెరెల్ ఐదు మార్గాలను ప్రతిపాదించారు. అవి 1. నేర్చుకుంటూ ఎదగడానికి ప్రాధాన్యత ఇవ్వడం 2.లక్ష్యం ఏర్పరచుకోవడం- రోజువారీ ప్రగతి సాధన, 3. అసౌకర్యాలను సౌకర్యవంతంగా భావించడం, 4. నష్టాలను సైతం ఓర్చుకోవడం, 5. ఇతర సంస్థాపకులతో సమారోహాల్లో పాల్గొనడం. వ్యవస్థాపనలకైనా, నవకల్పనలకైనా కావాల్సింది ఒక ఐడియానే.

ప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు, క్రియేటివ్ లైవ్ సిఇఒ ఛేజ్ జార్విస్ తన ‘క్రియేటివ్ కాలింగ్’ గ్రంథంలో DEA ను ‘Imagine what you want to create without limitation, Design a strategy to make your dream a new reality, Execute your strategy and smash through obstacles, Amplify your vision to create the impact your seek’ గా విస్తరించారు. చాతుర్యానికి అన్నా, శక్తినింపేందుకు అన్నా ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుందనే మాట ముమ్మాటికీ సత్యం. ఆవిష్కర్తలుగా మారేందుకైనా, ఆంట్రెప్రెన్యూయర్లుగా స్థిరపడేందుకైనా కాలేజీలు, యూనివర్సిటీలు యువజనులకు ఇవ్వాల్సింది సరికొత్త ఐడియాలనే. ఎందుకోసం అంటే, నవకల్పలనలు వ్యవస్థాపనలదే భవిష్యత్తు.

డా. బెల్లియాదయ్య- 9848392690

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News