హైదరాబాద్: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్రంగా స్పందించారు. మార్చేయడానికి… తీసేయ్యటానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఒక తెలుగుజాతి వెన్నెముక అని పేర్కొన్నారు. తండ్రి గద్దెనెక్కి శంషాబాద్ ఎయిర్‌పోర్టు పేరు మార్చారు. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నారు. మిమ్మల్ని మార్చడానికి ప్రజలున్నారని హెచ్చరించారు. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త అన్నారు. విశ్వాసం లేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ పార్టీలో ఉన్న చాలా మంది నాయకులు ఎన్టీఆర్ ఇచ్చిన భిక్షతోనే బతుకుతున్నారని బాలకృష్ణ పేర్కొన్నారు.
#NBK via Facebook page 🔥🔥
Thaggedhi ledhu asalu 🤙#RetainNTRname #NandamuriBalakrishna pic.twitter.com/sOsxbjrIKT
— manabalayya.com🌟 (@manabalayya) September 24, 2022