Monday, December 23, 2024

చైల్డ్ పోర్నోగ్రఫీపై సిబిఐ ఉక్కుపాదం

- Advertisement -
- Advertisement -

CBI-Megha Chakra Operation

‘ఆపరేషన్ మేఘ’ చక్ర పేరిట భారీ ఆపరేషన్ 
20 రాష్ట్రాల్లోని  56 ప్రదేశాల్లో సోదాలు

న్యూఢిల్లీ: చైల్డ్ పోర్నోగ్రఫీపై సిబిఐ ఉక్కుపాదం మోపుతోంది. ఆన్‌లైన్‌లో ఇలాంటి వీడియోలు అప్ లోడ్ చేసే వాళ్ల ఆటకట్టించేందుకు ‘ఆపరేషన్ మేఘ చక్ర’ ఏర్పాటు చేసింది. ఇలాంటి రెండు కేసులకు సంబంధించి సిబిఐ అధికారులు 20 రాష్ట్రాల్లోని 56 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు.

న్యూజిలాండ్‌లోని ఇంటర్‌పోల్ యూనిట్ సింగూపూర్ అందించిన సమాచారం ఆధారంగా ఈ శోధనలు జరిగినట్టు సిబిఐ వర్గాలు తెలిపాయి. ఆన్‌లైన్‌లో లభ్యమయ్యే పిల్లల లైంగిక వేధింపుల మెటీరియల్‌ (సిఎస్ఏఎమ్)ను అరికట్టే చర్యల్లో సీబీఐ చేస్తున్న అతిపెద్ద ఆపరేషన్ ఇది. సింగపూర్ ఇంటర్‌పోల్ నుంచి ఇన్‌పుట్స్, క్లౌడ్ స్టోరేజీని ఉపయోగించి ఇంటర్నెట్‌లో సిఎస్ఏఎమ్ పెడ్లర్లకు వ్యతిరేకంగా గత సంవత్సరం నిర్వహించిన ఆపరేషన్ కార్బన్ సమయంలో లభించిన సమాచారంగా ఈ శోధనలు జరిగాయి.

మైనర్‌లతో అక్రమ లైంగిక కార్యకలాపాల ఆడియో-విజువల్స్‌ను ప్రసారం చేయడానికి పెడ్లర్లు ఉపయోగించే క్లౌడ్ స్టోరేజీ సౌకర్యాలను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకొని ఈ ఆపరేషన్ ‘మేఘ చక్ర’ పని చేస్తోంది. ప్రత్యేక సైబర్ క్రైమ్ విభాగాన్ని ఏర్పాటు చేసిన సిబిఐ భారతదేశం అంతటా సిఎస్ ఏఎమ్ పెడ్లర్లను దెబ్బతీసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News