- Advertisement -
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్, ఉత్తరాఖండ్ లోని పౌరిలో చోటుచేసుకున్న ఘటనలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం నాడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళలు సురక్షితంగా ఉన్నప్పుడే దేశ ప్రగతి సాధ్యమౌతుందని చెప్పారు. ఉత్తరాఖండ్‌లోని పౌరిలో మహిళా రెసెప్షనిస్టు హత్య కేసులో బీజేపీ నేత కుమారుడు, మరో ఇద్దరు రిసార్టు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేయగా, మొరాదాబాద్‌లో ఓ మహిళ వివస్త్రగా రోడ్డుపై నడిచి వెళ్తున్న దృశ్యం వీడియో వైరల్ కావడం సంచలనం కలిగించాయి. ఈ రెండు సంఘటనలపై రాహుల్ శనివారం ట్విటర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.
- Advertisement -