Wednesday, January 22, 2025

పర్మిట్ లేకుండా పరుగులు

- Advertisement -
- Advertisement -

రూల్స్ బ్రేక్ చేస్తున్న కర్ణాటక, మహారాష్ట్ర బస్సులు పట్టించుకొని ఆర్‌టిఎ, ఆర్‌టిసి
అధికారులు చెక్‌పోస్టుల వద్ద నిఘా కరువు ప్రభుత్వానికి కోట్లలో నష్టం

చెక్ చేయాలని ఆదేశించాం
గతంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకునేవి. ప్రస్తుతం పర్మిట్ లేకుండా నడిచే బస్సులపై చర్యలు తీసుకుంటున్నాం. దీనికో సం ఆర్‌టిఏ అధికారుల తో నిరంతరం సమన్వ యం చేసుకుంటూ ఇతర రాష్ట్రాలకు చెందిన బస్సుల పర్మిట్‌లను చెక్ చేయాలని ఆర్టీసి, ఆర్‌టిఏ అధికారులకు సూ చించాం. దీనికోసం ఎంజిబిఎస్, సిబిఎస్ బస్టాండ్‌లలో టీంలను ఏర్పాటు చేశాం.
                                                                           

                                                                                    – సజ్జనార్, ఆర్టీసి ఎండి, వైస్ చైర్మన్

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో నిబంధనల మేరకు బస్సులను తిప్పాల్సిన రాష్ట్రాలు రూల్స్‌ను బ్రేక్ చే స్తున్నాయి. ఫలితంగా రాష్ట్రానికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయానికి కొన్ని రాష్టాల బస్సులు గండి కొడుతున్నాయి. గతంలో కరోనాతో తీవ్రంగా నష్ట పోయిన రంగంలో ఆర్టీసి కూడా ఒకటి. కరోనా అనంతరం ఆన్‌లాక్‌లో భాగంగా కర్ణాటక, మహారాష్ట్రలకు చెం దిన అంతర్ రాష్ట్ర బస్సులు మనరాష్ట్రం లో తిరిగేలా ప్రభుత్వం అనుమతి ఇ చ్చింది. అయితే ప్రస్తుతం అంతర్ రా ష్ట్ర రవాణా ఒప్పందానికి కర్ణాటక, మహారాష్ట్ర ఆర్టీసిలు విరుద్ధంగా వ్యవహారిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే మన దగ్గర ఆ రెండు రాష్ట్రాలకు చెందిన బస్సులు 500 కు నడుస్తున్నాయని, అందులో చాలా బస్సులకు పర్మిట్‌లు లేవని, ఆయా బస్సుల పర్మిట్‌లపై ఆర్‌టిఏతో పాటు ఆర్టీసి అధికారులు పట్టించుకోవడం లే దన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తెలంగాణకు చెందిన బస్సులను కర్ణాటక, మహారాష్ట్రల్లో నడుపుతుండగా నిరంతరం ఆయా రాష్ట్రాల అ ధికారులు తెలంగాణ బస్సుల పర్మిట్‌లను చెక్ చేస్తూ వారి ఆదాయానికి గండిపడకుండా అక్కడి అధికారులు నిరంతరం శ్రద్ధ తీసుకుంటున్నారని, మనదగ్గర కూడా అధికారులు అలాంటి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

కర్ణాటకకు చెందిన 372 బస్సులు

కర్ణాటకకు చెందిన 372 బస్సులు, మహారాష్ట్రకు చెందిన బస్సులు 165 వరకు మనరాష్ట్రంలో తిరుగుతున్నట్టుగా ఆర్టీసి, ఆర్టీఏ అధికారుల లెక్కలు పేర్కొంటున్నాయి. ఇక తెలంగాణకు చెందిన ఆర్టీసి బస్సులు కర్ణాటకలో 274, మహారాష్ట్రలో 171 బస్సులు పర్మిట్‌తో ప్రయాణికులను చేరవేస్తున్నాయి. అయితే ఒక్కసారి మనరాష్ట్రంలోకి వచ్చి తిరిగి వెళ్లడానికి రూ.450లను పర్మిట్ కింద తెలంగాణ ప్రభుత్వం ఆయా రాష్ట్రాల బస్సుల నుంచి చార్జీలను వసూలు చేస్తున్నాయి. అయితే ఈ పర్మిట్‌కు సంబంధించిన డబ్బులను ఎగ్గొట్టడానికి కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన అధికారులు పర్మిట్ లేకుండా తమ బస్సులను తెలంగాణలో తిప్పుతున్నట్టుగా తెలిసింది. అయితే అందులో కొన్ని బస్సులకు మాత్రమే పర్మిట్ తీసుకొని మిగతా బస్సులకు పర్మిట్ లేకుండా తెలంగాణకు రావాల్సిన ఆదాయాన్ని ఎగ్గొడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చెక్‌పోస్టుల వద్ద నిఘా….

లాక్‌డౌన్ ముందు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఇంటర్ స్టేట్ బస్సులకు కచ్చితంగా పర్మిట్ తీసుకున్న తరువాతే తెలంగాణ రాష్ట్రంలోకి బస్సులను అనుమతించేవారు. కరోనా తరువాత తెలంగాణ సరిహద్దుల్లోని చెక్ పోస్టుల వద్ద ఎవరూ పట్టించుకోక పోవడంతో యథేచ్ఛగా పర్మిట్లు లేని బస్సులు రాష్ట్రంలో తిరుగుతున్నాయి. పర్మిట్లు లేని బస్సులు తెలంగాణలో స్టేజ్ క్యారీయర్లుగా తిప్పడం వల్ల తెలంగాణ రవాణాశాఖ ఆదాయానికి గండి పడుతుందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

ఆర్టీసి అధికారుల నిర్లక్షం వల్లే….

ఇతర రాష్ట్రాల బస్సులు తెలంగాణ ప్రాంతంలోకి అడుగు పెట్టినప్పుడు, కచ్చితంగా ఆయా బస్సులపై ఇక్కడి ఆర్టీసి అధికారుల పర్యవేక్షణ నిఘా ఉంటుంది. అగ్రిమెంట్ ప్రకారమే రాష్ట్రంలో బస్సులు తిప్పాల్సి ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో కర్ణాటక నుంచి 250 బస్సులు, మహారాష్ట్ర నుంచి 150 బస్సులు పర్మిట్‌లు లేకుండా మహాత్మా గాంధీ బస్ స్టేషన్‌లోకి వస్తున్నట్టుగా ఆర్టీసి అధికారులు గుర్తించారు. తెలంగాణ సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద ఎవరూ పట్టించుకోక పోవడంతో యథేచ్ఛగా పర్మిట్లు లేని బస్సులు రాష్ట్రంలో తిరుగుతున్నాయని ఆర్టీసి అధికారులు పేర్కొంటు న్నారు. ఇది ఆర్‌టిఏ అధికారులకు సంబంధించి విషయమని ఆర్టీసి అధికారులు పేర్కొంటుండగా, ఆర్‌టిఏ అధికారులు మాత్రం ఆర్టీసి అధికారుల నిర్లక్షం వల్లే అక్రమంగా బస్సులు రాష్ట్రంలోకి వస్తున్నాయని, కనీసం ఈ విషయాన్ని తమకు తెలియచేయడం లేదని ఆర్‌టిఏ అధికారులు పేర్కొంటున్నారు.

రవాణాశాఖకు వందల కోట్ల నష్టం

ప్రతి బస్సుకు ఐదేళ్ల పర్మిట్ కాలపరిమితి ఉంటుంది. అయితే తెలంగాణలోకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన బస్సులకు సంబంధించిన పర్మిట్‌ల గురించి అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇంటర్ స్టేట్ బస్సులు ప్రారంభమైన తరువాత తెలంగాణకు వచ్చే కొన్ని బస్సుల పర్మిట్ చెక్ చేసిన సమయంలో కర్ణాటక, మహారాష్ట్ర బస్సులు పర్మిట్ లేకుండా తిరుగుతున్న విషయం బయటపడింది. పర్మిట్లు లేని బస్సులు తెలంగాణలో స్టేజ్ క్యారీయర్లుగా తిప్పడంతో రాష్ట్ర రవాణాశాఖకు వందల కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడుతుందని ఇకనైనా ఆర్టీఏ అధికారులు ఈ విషయంలో స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రైవేటు బస్సులది అదే దారి….

ప్రభుత్వ బస్సులతో పాటు ప్రైవేటు బస్సులు సైతం తెలంగాణలో యథేచ్ఛగా అనుమతి లేకుండా తిరుగుతున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ అడ్డదారిలో జిల్లా ప్రయాణికులను తరలించుకుపోతూ ఆర్టీసి ఆదాయానికి గండి కొడుతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కాంటాక్టు క్యారియర్ అనుమతులు ఉన్న బస్సులు మధ్యలో ఆపి ప్రయాణికులను తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధం. కానీ, సరిహద్దులో ఉన్న జిల్లా ల మీదుగా నిత్యం రాకపోకలు సాగించే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు స్టేజ్ క్యారియర్ అనుమతి లేకున్నా మధ్యలో ఆపి ప్రయాణికులను తీసుకెళ్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News