మన తెలంగాణ/హైదరాబాద్ : మునుగోడు నియోజకవర్గాన్ని భారీ మెజార్టీతో టిఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. టిఆర్‌ఎస్ పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారన్నారు. అందుకే వివిధ రాజకీయ పార్టీల నుంచి పెద్దఎత్తున నేతలు ఆయా పార్టీలకు గుడ్‌బై చెప్పి టిఆర్‌ఎస్‌లో వచ్చి చేరుతున్నారన్నారు. ఆదివారం మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఇప్పర్తి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బిజెపికి చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి జగదీష్‌రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారిని పార్టీలోకి ఆయన సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, బిజెపి రాజకీయ అధికార దాహంతోనే ఈ ఉపఎన్నిక వచ్చిందని మండిపడ్డారు. అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగానికి కారణమైన బిజెపి అభ్యర్ధి రాజ్‌గోపాల్‌రెడ్డికి తగు రీతిలో ప్రజలు బుద్దిచెప్పనున్నారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈ ఉపఎన్నికలోనూ బిజెపి డిపాజిట్ కోల్పోవడం తథ్యమని మంత్రి జగదీష్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్‌లో చేరిన వారిలో పాల సొసైటీ చైర్మన్ చీమల వరుణ్ యాదవ్, మాజీ గ్రామ పంచాయతీ సభ్యుడు ఈరటి శ్రీశైలం, పెద్ద గొల్ల బూడిద నరసింహా యాదవ్, బచ్చనగోని లింగస్వామి,ఈరటి శంకర్,ఆడెపు ప్రశాంత్, బొజ్జ యాదయ్య,ఆడిమయ్యా,బబుల్, కట్ట రమేష్, బద్ధుల శేఖర్, పాసు సాయిచందు తదితరులు ఉన్నారు.
మునుగోడులో కారుదే విజయం: జగదీష్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -