Monday, April 7, 2025

నళిని వేసిన పిటిషన్‌పై కేంద్రం, టిఎన్‌ఎస్‌కు సుప్రీంకోర్టు నోటీసు

- Advertisement -
- Advertisement -

 

Prevention of hate speech is the responsibility of TV anchors

న్యూఢిల్లీ: రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న నళిని శ్రీహరన్‌ను ముందస్తుగా విడుదల చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాల నుంచి స్పందన కోరింది. న్యాయమూర్తులు బిఆర్ గవాయి, బివి నాగరత్నలతో కూడిన ధర్మాసనం కేంద్రం , తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది,  ఈ పిటిషన్‌పై వారి సమాధానాలను కోరింది.

ఈ కేసులో దోషిగా ఉన్న ఆర్‌పి రవిచంద్రన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.నళిని జూన్ 17న మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేసింది, కాగా కోర్లు ముందస్తు విడుదల కోసం ఆమె చేసిన అభ్యర్థనను తిరస్కరించింది, సహ దోషి ఏజి పేరారివాలన్‌ను విడుదల చేయాలంటూ సుప్రీం కోర్టు తీర్పును పేర్కొంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం అలా చేయడానికి హైకోర్టులకు అధికారం లేదని, ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు కున్నట్లు అధికారం లేదని పేర్కొంటూ వారి అభ్యర్థనలను తిరస్కరిస్తూ హైకోర్టు పేర్కొంది. ఆర్టికల్ 142 ప్రకారం, అత్యున్నత న్యాయస్థానం “సంపూర్ణ న్యాయం” అందించడానికి అవసరమైన ఏదైనా తీర్పు లేదా ఉత్తర్వును జారీ చేయవచ్చు.

నలుగురు దోషులైన పెరారివాలన్, మురుగన్, సంతన్, నళిని జీవిత ఖైదు శిక్షను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. అయితే వారి క్షమాభిక్ష పిటిషన్లను పరీశీలించడంలో ఆలస్యం జరిగినందున సంతన్, మురుగన్ సహా పెరారివాలన్ మరణశిక్షను జీవిత ఖైదు శిక్షగా కోర్టు మార్చింది. నళినికి ఓ కూతురు ఉన్నందున ఆమె మరణశిక్షను 2001లో జీవిత ఖైదుగా మార్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News