Monday, December 23, 2024

రూ.200 కోట్ల దోపిడీ కేసు… జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బెయిల్

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ : రూ.200 కోట్ల దోపిడీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో పాటియాలా హౌస్ కోర్టు ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో జాక్వెలిన్‌ను నిందితురాలిగా పేర్కొంటూ ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఛార్జిషీట్‌ను పరిశీలించిన న్యాయస్థానం జారీ చేసిన సమన్ల ప్రకారం సోమవారం పాటియాలా హౌస్ కోర్టుకు జాక్వెలిన్ హాజరయ్యారు. ఈ క్రమం లోనే ఆమె తరఫు న్యాయవాది బెయిల్ కోసం కోర్టుకు దరఖాస్తు సమర్పించగా, దీనిపై న్యాయస్థానం ఈడీ నుంచి స్పందన కోరింది.

రెగ్యులర్ బెయిల్ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున అప్పటివరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని జాక్వెలిన్ న్యాయవాది కోరగా రూ. 50 వేల పూచీకత్తుపై జాక్వెలిన్‌కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబరు 22 కి వాయిదా వేసింది. దాదాపు రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ నుంచి జాక్వెలిన్ ఖరీదైన బహుమతులు అందుకున్నట్టు వార్తలు రావడంతో ఈడీ దర్యాప్తు చేపట్టి నిందితురాలిగా జాక్వెలిన్‌ను పేర్కొంది. ఇటీవల ఢిల్లీ పోలీసులు కూడా ఈ కేసులో నటిని రెండుసార్లు విచారించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News