జైపూర్: కాంగ్రెస్ రాజస్థాన్ ఇంఛార్జి అజయ్ మాకెన్ సోమవారం అశోక్ గెహ్లాట్ శిబిరంపై షరతులతో కూడిన తీర్మానాన్ని ముందుకు తెచ్చినందుకు విమర్శించారు. దీనిని ప్రయోజనాల విరుద్ధమని(conflict of interest) పేర్కొన్నారు. ఇప్పటికే సిఎల్‌పి సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు సమాంతర సమావేశానికి పిలుపునివ్వడం ప్రాథమికంగా క్రమశిక్షణారాహిత్యమేనని ఎఐసిసి పరిశీలకుడు అన్నారు. ఆయన జైపూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ గత రాత్రి గెహ్లోత్ శిబిరం ఎంఎల్ఏలు, మంత్రులు శాంతి ధారివాల్, మహేశ్ జోషి, ప్రతాప్ సింగ్ కచరియావస్ తనతో పాటు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న మల్లికార్జున ఖర్గేని కలిశారన్నారు. పైగా వారు తమ ముందు మూడు షరతులు పెట్టారన్నారు.
నేడు ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. పూర్తి వివరాలు ఆమెకు వివరించారు. అయితే ఆమె పూర్తి రిపోర్టును కోరినట్లు తెలిపారు.
सोनिया गांधी से मिलकर बाहर निकले अजय माकन, हमने पूरी बात कांग्रेस अध्यक्षा को बताया। उन्होंने लिखित में विस्तृत रिपोर्ट मांगी है
#हल्ला_बोल #Rajasthan #Congress pic.twitter.com/cownitcoBW— AajTak (@aajtak) September 26, 2022