Friday, January 10, 2025

వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శప్రాయం: మేయర్ విజయలక్ష్మి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తెగించి పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శప్రాయమని మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి (చిట్యాల) ఐలమ్మ 127 జయంతి వేడుకలను సోమవారం జి హెచ్ ఏం సి ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్ర పటానికి మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, అడిషనల్ కమిషనర్ శృతి ఓజా, బి సంతోష్ , సరోజ, జయరాజ్ కెన్నెడీ, సి సి పి దేవేందర్ రెడ్డి, ఎంట మాలోజి చీఫ్ రాంబాబు ,చీఫ్ ఎగ్జామినర్ అకౌంట్స్ వెంకటేశ్వర రెడ్డి, సి పి అర్ ఓ మొహమ్మద్ మూర్తుజా, పి అర్ ఓజీవన్ పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఆనాడు నిరంకుశ రజాకార్లను దేష్ముఖ్ లకు వ్యతిరేఖంగా మొక్కవోని దైర్యం పోరాడిన న వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ వీరవనిత ధైర్య శాలిగా పేరుగాంచిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ద్వారా వారి త్యాగాల స్మరించుకుంటున్నామని తెలిపారు. నాడు వారు చేసిన పోరాట ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికిందని, చాకలిఐలమ్మ ధైర్యం తెగువ చూపుతూ దేశ్ ముఖ్, రజాకార్ల గుండెల్లో భయం పుట్టిందని మేయర్ పేర్కొనారు. జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ -సామాజిక ఆధునిక పరిమాణానికి నాంది పలికిన స్త్రీ ధైర్యశాలి అని కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News