హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు హైదరాబాద్ రవీంద్రభారతిలో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ స్వాతంత్ర్య, నిజాం వ్యతిరేఖ, తెలంగాణ పోరాటాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు వెలకట్టలేనివన్నారు. గత ఉమ్మడి రాష్ట్రంలో ఈ మహనీయున్ని ప్రభుత్వాలు పట్టించుకోలేదని నేడు కేసీఆర్ సారథ్యంలో ఘనంగా జలద్రుశ్యంలో విగ్రహావిష్కరణ చేసుకొని రాష్ట్ర పండుగగా జయంతిని నిర్వహించుకుంటున్నామన్నారు. భారత స్వర్ణోత్సవాల వేల జెండాల్ని సైతం చైనా నుండి తెచ్చిన కేంద్రప్రభుత్వం ఎక్కడా… మన నేతన్నలకు ఆత్మగౌరవంతో పాటు ఆర్థిక స్వావలంబన చేకూరుస్తూ బతుకమ్మ చీరల్ని అందిస్తున్న కేసీఆర్ ఎక్కడా అని చురకలంటించారు. ఆత్మగౌరవ భవనాలు, 24గంటల ఉచిత కరెంటు, సాగు, తాగునీరు ఇవ్వడం చాతకానోళ్లు తెలంగాణలో మొరుగుతున్నారని, వాళ్లని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఇలాంటి విచ్చినకర దుష్టులకు అవకాశం ఇవ్వకుండా అందరూ సంఘటితంగా ఉండి కేసీఆర్ గారికి అండగా ఉండాలని మంత్రి తలసాని పిలుపునిచ్చారు.
అనంతరం ఈ కార్యక్రమంలో ఎల్. రమణ మాట్లాడుతూ.. పద్మశాలీలకే కాదు యావత్ బడుగు బలహీనవర్గాలకు కొండాలక్ష్మణ్ బాపూజీ స్పూర్తి ప్రదాతని, ఆ మహనీయుని ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అన్నారు. ఈ ఒక్కరోజే మంత్రుల చేతుల మీదుగా ఐదు చోట్ల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలు ఆవిష్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు, కేవలం తెలంగాణలో తప్ప మరెక్కడా ఇది సాద్యంకాదన్నారు. బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణ క్రుష్ణమోహన్ రావు మాట్లాడుతూ… తెలంగాణకే యావజ్జీవితం అంకితం చేసిన తొలి తరం ఉద్యమకారుడు కొండాలక్ష్మణ్ బాపూజీ అని, తొలిదశ పోరాటానికి మద్దతుగా మంత్రి పదవిని త్యజించి మల్లీ స్వీకరించని ఆత్మగౌరవ పతాక అన్నారు. నాడు కాల్కేల్కర్ కమిటీ సీపార్సుల అమలు కోసం పోరాడడమే కాక, రాష్ట్రంలో అనంతరామన్ కమిటీ ఏర్పాటుకు క్రుషిచేసాడని కొనియాడారు. చాకలి ఐలమ్మతో పాటు నాటి ఉద్యమకారులకు న్యాయపోరాటం అందించారన్నారు. చింతా ప్రభాకర్ మాట్లాడుతూ… నేటి ఉత్సవాలకు అధ్యక్షత వహించే అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ చంద్రకుమార్, ప్రొపెసర్ వెంకటరత్నంలకు కొండా లక్ష్మణ్ బాపూజీ జీవన సాఫల్య పురస్కారం అందజేసారు.
రవీంద్ర భారతి లో నిర్వహించిన స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలలో పాల్గొనడం జరిగింది. pic.twitter.com/SizhLlSBPv
— Talasani Srinivas Yadav (@YadavTalasani) September 27, 2022