Monday, January 20, 2025

కిషన్ రెడ్డి చేతకాని దద్దమ్మ: ఎంపి మాలోత్ కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గిరిజనుల రిజర్వేషన్లకు కేంద్రం కుంటి సాకులతో మోకాలడ్డుతోందని ఎంపి మాలోత్ కవిత ఆరోపించారు. ఎంపి మాలోత్ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే రెడ్యా నాయక్ లతో కలిసి మంగళవారం టిఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాలోత్ కవిత మాట్లాడుతూ..  బిజెపికి గిరిజనులంటే గిట్టదని, ఆ పార్టీకి గిరిజనులంటే కళ్ల మంటఅని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్ల తర్వాత బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమని కిషన్ రెడ్డి చావు కబురు చెప్పారని, కిషన్ రెడ్డి తన ప్రకటనతో తాను ఓ చేత కానీ దద్దమ్మ అని నిరూపించుకున్నారని ఆమె ఆరోపించారు. తెలంగాణ పట్ల బిజెపికి చిత్తశుద్ధి లేదని కిషన్ రెడ్డి ప్రకటనతో రుజువయ్యిందన్నారు. కిషన్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, బిజెపి పార్టీ భరతం పట్టే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని ఆమె హెచ్చరించారు. కేంద్ర మంత్రులు టూరిస్టుల్లా వచ్చి పోతున్నారు తప్ప తెలంగాణకు చేసిందేమీ లేదని ఆమె దుయ్యబట్టారు. కేంద్ర మంత్రిగా ఉండి కిషన్‌రెడ్డి కనీస సమాచారం లేకుండా మాట్లాడుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. పార్లమెంట్ చేసిన చట్టాన్ని కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి ఉల్లంఘించారన్నారు. తెలంగాణకు కిషన్ రెడ్డి లాంటి ఉత్సవ విగ్రహాలు అవసరం లేదన్నారు. గిరిజన యువత ఉద్యోగ అవకాశాలను బిజెపి దెబ్బ తీస్తోందని ఆమె ఆరోపించారు. తెలంగాణలో బిజెపికి రాజకీయంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు మేలు చేయడంలో లేదన్నారు.

MP Maloth Kavitha slams Kishan Reddy over tribal reservation

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News