- Advertisement -
న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌నాయర్‌ను సిబిఐ మంగళవారం రెఫైస్టు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి జరిగిన కుంభకోణంలో విజయ్‌కు సంబంధం ఉందని సిబిఐ అధికారులు తెలిపారు. ఢిల్లీ సిఎం మనీశ్ కూడా ఈ కేసులో నిందితుడిగా పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన నాయర్‌నుప్రశ్నించేందుకు సిబిఐ కార్యాలయానికి రావాల్సిందిగా తెలిపామన్నారు. దేశ రాజధానిలో లిక్కర్ లైసెన్స్ కేటాయింపులో అవకతవకల్లో నాయర్ కీలకపాత్ర పోషించారు. వాటాల కేటాయింపులో ఆయన ప్రధానంగా వ్యవహరించారనే ఆరోపణలతో అరెస్టు చేశామని సిబిఐ తెలిపాయి. నాయర్ తరఫున వ్యాపారి సమీర్ మహేంద్రు నుంచి సిసోడియా అసోసియేట్ అర్జున్‌పాండే నుంచి రూ.4కోట్లు వసూలు చేశారని ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించారు. కాగా నాయర్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ మచ్ లౌడర్ (ఒఎంఎల్) మాజీ సిఇఒగా సిబిఐ అధికారులు వెల్లడించారు.
- Advertisement -