- Advertisement -
వరంగల్: జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జిల్లాలోని ఖానాపూర్ లో భర్త, అత్తమామల వరకట్నం వేధింపులే కారణమని బాధితురాలు నూర్జహాన్ సెల్ఫి వీడియో తీసి చనిపోయేందుకు యత్నించింది. అయితే, ఇరుగు పొరుగు వారు ఆమెను కాపాడి చికిత్స నిమిత్తం ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితురాలి సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ జరపనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Woman Attempt Suicide in Warangal
- Advertisement -