Monday, December 23, 2024

పుట్టింటికి వెళ్లనివ్వలేదని మామ మర్మాంగాన్ని కోసిన కోడలు

- Advertisement -
- Advertisement -

Young Boy murdered in Chandrayangutta

కోల్‌కతా: చికెన్ కూర తినడానికి పుట్టింటికి వెళ్లనివ్వలేదని తన మామ మర్మాంగాలను కోడలు కోసిన సంఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రం మైనా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తూర్పు మేదినీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తండ్రి తన కూతురు శిఖాకు ఫోన్ చేశాడు. మాంసం కూర వండామని తిని వెళ్లమని కబరు పంపాడు. శిఖా వెంటనే తన భర్తకు ఫోన్ చేసి వెళ్తానని చెప్పింది. ఇంట్లోనే చికెన్ కూర వండుకుందామని వెళ్లడానికి వీలు లేదన్నారు. కోపంతో రగిలిపోయిన శిఖా తన అత్త మామలతో గొడవకు దిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో సహనం కోల్పోయిన శిఖా తన మామ మర్మాంగాన్ని కత్తితో కోసింది. వెంటనే స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. శిఖా అక్కడి నుంచి తప్పించుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News