- Advertisement -
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన ఆయన గాంధీ కుటుంబానికి ఎంతో సన్నిహితుడు కూడా. ఆయన కేరళలో ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్నారు. అయితే బుధవారం ఢిల్లీ చేరుకున్నారు. అంతేకాక గురువారం నామినేషన్ పేపర్లను తీసుకున్నారు. కాగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి చివరి రోజు శుక్రవారం. పార్టీ నాయకత్వం సూచనల మేరకు ఆయన అలా చేస్తున్నారా? అని అడిగినప్పుడు…‘నాకు నేనుగా పోటీ చేయాలనుకుంటున్నాను’ అన్నారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ తర్వాత గానీ ఆయన బరిలో ఉన్నది లేనిది స్పష్టం కాదు. ఆయన తన నామినేషన్ దాఖలు చేసేట్టయితే మధ్యప్రదేశ్ నుంచి 10కి పైగా కాంగ్రెస్ శాసనసభ్యులు ఢిల్లీ చేరుకుంటారు. ప్రస్తుతానికి శశిథరూర్ ఒక్కరే బరిలో ఉన్నట్లు ధ్రువీకరించిబడింది.
- Advertisement -