Monday, December 23, 2024

అశోక్ గెహ్లాట్ కు కళ్లెం వేసిన సోనియా

- Advertisement -
- Advertisement -

 

Ashok Gehlot

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్ధి రేసులో ముందున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెక్ పెట్టారు. నిన్న సాయంత్రం నుంచి పడిగాపులు కాసిన గెహ్లాట్‌కు ఎట్టకేలకూ అపాయింట్‌మెంట్ ఇచ్చిన సోనియా ఆయన్ను గట్టిగా మందలించారు. కెసి వేణుగోపాల్ సమక్షంలోనే క్లాసు పీకారు. ఇటీవల రాజస్థాన్‌లో గెహ్లాట్‌ వర్గీయులు ఓవర్ యాక్షన్ చేయడం, తాను ఏమీ చేయలేనంటూ గెహ్లాట్ చేతులెత్తేయడంపై సోనియా మండిపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న వేళ రాజస్థాన్ అసమ్మతి,  పార్టీకి చెడ్డపేరు తెచ్చిందని సోనియా కన్నెర్ర చేశారు. గంటకు పైగా జరిగిన సమావేశంలో సోనియా అన్ని విషయాలపై నిలదీశారు. రాజస్థాన్‌ అసమ్మతిని కంట్రోల్ చేయలేని నాయకుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ఎలా నడపగలరని సోనియా ప్రశ్నించినట్లు తెలిసింది. తన నమ్మకాన్ని గెహ్లాట్  వమ్ము చేశారని కూడా సోనియా అన్నట్లు సమాచారం.

సోనియాతో సమావేశం తర్వాత అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ తాను కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసులో లేనని, ఎన్నికల్లో పోటీ చేయబోవడంలేదని స్పష్టం చేశారు. అంతేకాదు తాను సిఎంగా ఉండాలా వద్దా అనేది కూడా సోనియా నిర్ణయిస్తారని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీకి విశ్వాసపాత్రుడైన కార్యకర్తనని చెప్పుకొచ్చారు. ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్ ఆదేశాలను తాను పాటిస్తానన్నారు. రాజస్థాన్‌లో తన మద్దతు దారుల ఓవర్ యాక్షన్‌పై సోనియాకు క్షమాపణ చెప్పానని కూడా గెహ్లాట్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News