- Advertisement -
వాషింగ్టన్: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఓ విమానం విద్యుత్ శక్తిని వినియోగించుకుని గాల్లోకి ఎగిరింది. ఈ విమానం పేరు ‘ఆలిస్’. ఇది విజయవంతంగా తొలి గగనవిహారం చేసింది. అమెరికాలోని గ్రాంట్ కౌంటీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో టెస్ట్ ఫ్లయిట్ చేపట్టారు. గాల్లో 3,500 అడుగుల ఎత్తులో 8 నిమిషాల పాటు గగనయానం చేసింది. ఇది పూర్తిగా కరెంటుతో నడిచే విమానం. ఇది గరిష్ఠంగా 260 నాట్ల వేగంతో ప్రయాణిస్తుంది. తేలికపాటి జెట్ విమానాలు, హైఎండ్ టర్బోప్రాప్ విమానాల ఖర్చుతో పోల్చితే ‘ఆలిస్’ ప్రయాణానికి అయ్యే ఖర్చు (ఒక గంటకు) ఎంతో తక్కువ అని ఏవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ చెబుతోంది.
- Advertisement -