న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేష్ అంబాని భద్రతను కేంద్ర హోం శాఖ మరింత కట్టుదిట్టం చేసింది. రియల్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీకి ప్రస్తుతం అందచేస్తున్న జెడ్ క్యాటగిరి భద్రతను జెడ్ ప్లస్ క్యాటగిరికి పెంచాలని హోం శాఖ నిర్ణయించినట్లు వర్గాలు తెలిపాయి. గత ఏడాది అంటిలియాలోని ముకేష్ అంబానీ నివాసం వెలుపల బాంబు బెదిరింపు సంభవించడంతో ఆయనకు అందచేస్తున్న భద్రతను పటిష్టం చేయడంపై కేంద్ర హోం శాఖ చర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రముఖులకు వివిధ రకాలైన భద్రతను కేంద్ర హోం శాఖ అందచేస్తోంది. ఐదు గ్రూపులుగా భద్రతను విభజించిన హోం శాఖ ఆయా వ్యక్తులు ఎదుర్కొంటున్న భద్రతా ముప్పును అధ్యయనం చేసిన అనంతరం వారికి ఎక్స్, వై, జెడ్, జెడ్ ప్లస్, ఎస్‌పిజి క్యాటగిరీలలో భద్రతను సమకూరుస్తోంది. విఐపిలు, వివిఐపిలు, అథ్లెటిక్స్, పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రముఖులు, ఇతర ఉన్నత స్థాయి వ్యక్తులకు వారి వారి అవసరం మేరకు భద్రతను కేంద్ర హోం శాఖ అందచేస్తోంది.
ముకేష్ అంబానికి భద్రత కట్టుదిట్టం
- Advertisement -
- Advertisement -
- Advertisement -