Tuesday, December 24, 2024

ప్రభాస్‌కు ఆత్మీయ స్వాగతం

- Advertisement -
- Advertisement -

Interview with Hero Prabhas

ఇటీవల కన్నుమూసిన రెబల్ స్టార్ కృష్ణంరాజు స్మారక కార్యక్రమం గురువారం ఆయన స్వస్థలమైన మొగల్తూరులో ఘనంగా జరిగింది. ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. దాదాపు పదేళ్ల తర్వాత ప్రభాస్ ఈ ప్రాంతానికి వచ్చారు. ఇన్నేళ్ల తర్వాత ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబ సభ్యులు ఊరికి రావడంతో స్థానిక ప్రజలు ఆత్మీయంగా వారికి స్వాగతం చెప్పారు. తాము ఎంతగానో అభిమానించే కృష్ణంరాజు భౌతికంగా దూరమవడం అక్కడి వారిలో ఉద్వేగాన్ని నింపింది. ఈ స్మారక కార్యక్రమానికి భారీ ఎత్తున స్థానిక ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. వచ్చిన వారిని పలకరించి, అభివాదాలు తెలిపారు ప్రభాస్. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. వచ్చిన ప్రతి ఒక్కరూ సంతృప్తిగా తినేందుకు భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రభాస్ ప్రతి ఒక్కరినీ భోజనం చేసి వెళ్లమని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News