Saturday, January 18, 2025

యాదాద్రికి చేరుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Chief Minister KCR reached Yadadri

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం యాదాద్రిలో పర్యటిస్తున్నారు. సిఎం కెసిఆర్‌, ఆయన సతీమణి శోభతో కలిసి ప్రత్యేక బస్సులో రోడ్డుమార్గంలో యాదగిరిగుట్టకు చేరుకున్నారు. కాసేపట్లో సిఎం దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. కెసిఆర్‌ తన కుటుంబం తరఫున ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం కిలో 16 తులాల బంగారాన్ని సమర్పించనున్నారు. బాలాలయం ఆవరణలో ‘కళావేదిక’కు సిఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. తిరిగి సాయంత్రం 3 గంటలకు గుట్ట నుంచి ప్రగతి భవన్ కు బయలుదేరనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News