Saturday, November 16, 2024

కర్నాటకలోకి ’భారత్ జోడో యాత్ర‘

- Advertisement -
- Advertisement -

Bharat Jodo Yatra

గుండ్లుపేట:   తమిళనాడు, కేరళలో పర్యటించిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర శుక్రవారం కర్ణాటకలో ప్రవేశించడంతో నీలగిరి రోడ్డులో తమిళనాడు సరిహద్దులోని చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట పట్టణం పండుగ శోభ సంతరించుకుంది.  గుండ్లుపేట పట్టణంలోని రోడ్లన్నీ పోస్టర్లు, ఫ్లెక్స్ బోర్డులు, కాంగ్రెస్ జెండాలతో శోభాయమానంగా ఉండడంతో పట్టణంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు సందడి చేశారు.భద్రతా కారణంగా పార్టీ కార్యకర్తలను ఎక్కించుకునే బస్సులను పక్కనే ఉన్న ప్రాంతంలో నిలిపి వేయడంతో కార్యక్రమం 55 నిమిషాలు ఆలస్యమైంది.  150 రోజులు, 3,500 కిలోమీటర్ల కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు సాగే ఈ పాదయాత్ర 21 రోజుల్లో 511 కిలోమీటర్లు సాగనుంది. సెప్టెంబర్ 8న కన్యాకుమారిలో దీన్ని ప్రారంభించారు.

కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డికె శివకుమార్‌, ఆయన సోదరుడు, ఎంపి డికె సురేశ్  వేదికను నిర్వహణ చూస్తూ భద్రతా సిబ్బంది, సమన్వయకర్తలు, నేతలు, పార్టీ కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేస్తుండగా, కర్నాటక ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య  వేదిక వద్దకు చేరుకున్నారు.  బహిరంగ సభ ప్రారంభోత్సవానికి గుర్తుగా రాహుల్ డ్రమ్ వాయిస్తుండగా సిద్ధరామయ్య, శివకుమార్‌లతో చేతులు కలిపారు. ఈ సందర్భంలో తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత రాహుల్ గాంధీకి జాతీయ జెండాను అందజేశారు. జాతీయ కాంగ్రెస్ నాయకులు జైరాం రమేష్, రణదీప్ సూర్జేవాలా, రాష్ట్ర నాయకులు బికె హరిప్రసాద్, వీరప్ప మొయిలీ, కెహెచ్ మునియప్ప తదితరులు కూడా పాల్గొన్నారు.

“చారిత్రక” భారత్ జోడో మార్చ్‌లో పాల్గొనాలని శివకుమార్ బహిరంగ లేఖలో పౌరులను ఆహ్వానించారు. “ఇది పిక్నిక్ కాదని నేను మిమ్మల్ని హెచ్చరిస్తాను” అన్నారు.  ‘‘వాతావరణం ఎలా ఉన్నా రోజుకు 20 కిలోమీటర్లు నడుస్తాం. అన్ని వర్గాల వారిని కలుస్తాం’’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News