- Advertisement -
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వతంగా స్థిరపడాలనుకున్నవారికి గ్రీన్ కార్డు చాలా అవసరం. అయితే ఈ గ్రీన్‌కార్డుకు సంబంధించిన కీలక బిల్లును అమెరికా చట్టసభలో డెమోక్రాటిక్ పార్టీ సెనేటర్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు గనుక ఆమోదం పొందితే హెచ్-1బి వీసాలపై అమెరికాలో ఉంటున్న భారతీయులకు ఊరట కలుగుతుంది. అమెరికాలో ఏడేళ్లుగా నివసిస్తున్న వారికి శాశ్వత నివాస హోదా పొందటానికి అర్హత లభించనుంది. ఈ బిల్లును సెనేటర్ అలెక్స్ పాడిల్లా చట్ట సభలో ప్రవేశపెట్టారు. దానిని ఎలిజబెత్ వారెన్, బెన్ రే లుజాన్, డిక్ డర్బిన్ బలపరిచారు. ఏడేళ్లుగా అమెరికాలో నివసిస్తున్న వలసదారులకు గ్రీన్ కార్డు జారీ చేసే ఈ బిల్లును సెనేటర్లు ప్రతిపాదించారు. తాజా బిల్లు ఆమోదం పొందితే వలసదారుల గ్రీన్ కార్డు సమస్యలు తీరిపోతాయి.
- Advertisement -