మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశం ఉందని ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. శనివారం ఖమ్మం, సూర్యాపేట, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్గొండ, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షపాతం…
శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో 85 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్టు వాతావరణ శాఖ తెలిపింది. మహబూబాబాద్‌లో 75, వనపర్తిలో 65, మహబూబ్‌నగర్‌లో 64, నాగర్‌కర్నూల్‌లో 59, నల్లగొండలో 58, వరంగల్‌లో 54, నారాయణపేటలో 49, జోగుళాంభ గద్వాల్‌లో 48, మేడ్చల్ మల్కాజిగిరిలో 18, రంగారెడ్డి 10, హైదరాబాద్‌లో 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది.