Saturday, December 21, 2024

లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘జూనియర్’

- Advertisement -
- Advertisement -

Gali Kireeti Reddy's Junior Movie Title Launch

కర్నాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరిటీ రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ వారాహి చలనచిత్రం బ్యానర్ ప్రస్తుతం భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషలలో విడుదల కానుంది. చిత్ర నిర్మాతలు ఇదివరకే కిరీటి రెడ్డిని పరిచయం చేస్తూ ఒక గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఈ వీడియోలో కిరిటీ తన నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకున్నారు. శుక్రవారం కిరిటీ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటిస్తూ మరో గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘జూనియర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ వీడియోలో ఈ తరం యువత గురించి, భవిష్యత్తు లక్ష్యాల గురించి, ప్రతి జూనియర్‌కు ఉండే విశ్వాసం గురించి కిరిటీ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. టైటిల్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు ఉన్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, జెనీలియా ఒక ముఖ్యమైన పాత్రతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ లెజెండ్ క్రేజీ స్టార్ డాక్టర్ రవిచంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Gali Kireeti Reddy’s Junior Movie Title Launch

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News