Monday, December 23, 2024

గిరిజనుల ఆరాధ్య దైవం సిఎం కెసిఆర్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజ‌నుల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్, ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియజేశారు. గిరిజన రిజర్వేషన్ పెంపుతో గిరిజన నాయకులు శనివారం ఉదయం బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి సత్యవతి రాథోడ్ నివాసానికి చేరుకొని సిఎం కేసీఆర్ కి, మంత్రి సత్యవతి రాథోడ్ కు కృతజ్ఞతలు తెలిపారు. హర్షం వ్యక్తం చేస్తూ బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచుకుని, సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ… ”గిరిజనుల ఆరాధ్య దైవం సిఎం కెసిఆర్‌. సిఎం కెసీిఆర్ మాట తప్పని మడమ తిప్పని గొప్ప ఉద్యమ నాయకుడు. సెప్టెంబర్ 17న జ‌రిగిన ఆదివాసీ, గిరిజ‌నుల ఆత్మీయ స‌భ‌లో చేసిన ప్ర‌క‌ట‌న‌కు అనుగుణంగా నోటిఫికేష‌న్ జారీ చేసి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న మహానేత. గిరిజ‌న బిడ్డ‌ల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తూ నోటిఫికేష‌న్ జారీ చేశారు. తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌ కే దక్కుతుంది. రాష్ట్రంలో గిరిజ‌నుల జ‌నాభాకు అనుగుణంగా వారి రిజ‌ర్వేష‌న్ 10 శాతానికి పెంచాల‌ని ఇంత‌కుముందే రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందుకోసం రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఆమోదించి.. రాష్ట్ర‌ప‌తి అనుమ‌తి కోసం కేంద్రానికి పంపించాము. ఏడేండ్లు దాటినా గిరిజ‌నుల‌కు ప‌ది శాతం రిజ‌ర్వేష‌న్ల బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. గిరిజ‌న బిడ్డ‌ల కష్టాలు, స‌మ‌స్య‌లు, జీవ‌న స్థితిగ‌తుల‌పై పూర్తి అవగాహన ఉన్న మహానేత సిఎం కేసీఆర్. సిఎంకు యావత్ గిరిజన జాతి జీవితాంతం రుణపడి ఉంటుంది” అని అన్నారు. కాగా, ఈ రోజు నుంచి రిజ‌ర్వేష‌న్ల పెంపు అమ‌ల్లోకి వ‌స్తుంది. విద్య, ప్ర‌భుత్వ ఉద్యోగ నియామ‌కాల్లో గిరిజ‌నుల‌కు ఈ రిజ‌ర్వేష‌న్లు అమ‌ల‌వుతాయ‌ని నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు.

Satyavati Rathod thanks to CM KCR over ST’s Reservation

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News