Saturday, December 21, 2024

నేటి నుంచి డెబిట్, క్రెడిట్ కార్డుల టోకెనైజేషన్ అమలు

- Advertisement -
- Advertisement -

credit and debit cards

న్యూఢిల్లీ: డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల కోసం కొత్త నియమాలు ఈరోజు టోకనైజేషన్‌తో ప్రారంభమవుతాయి. ఆన్‌లైన్, పాయింట్ ఆఫ్ సేల్, ఇన్ యాప్ లావాదేవీలకు యునిక్ టోకెన్లు ఇస్తారు. డిజిటల్ పేమెంట్‌లో ఈ టోకెనైజేషన్ మరింత భద్రతను పెంచుతుందంటున్నారు. ఇప్పటికే గత రెండేళ్లలో ఈ టోకెనైజేషన్ గడువును అనేకమార్లు పొడగిస్తూ వచ్చారు. ఇక అందరూ టోకెనైజేషన్ లావాదేవీల వైపు మొగ్గుచూపాల్సిందే. సెప్టెంబర్ 30 నాటికి 35 కోట్ల కార్డులు టోకెనైజ్డ్ అయ్యాయని ఆర్బిఐ తెలిపింది. ఇక అక్టోబర్ 1 (నేటి) నుంచి కొత్త నియమాలు అమలవుతాయి. అసలు టోకెనైజేషన్ అంటే కార్డు వివరాలను ‘టోకెన్’ అనే కోడ్ ద్వారా ప్రత్యామ్నాయపరుస్తారు. టోకెనైజేషన్ ద్వారా కార్డు వివరాలు వ్యాపారితో లావాదేవీలప్పుడు పంచుకోవడం జరగదు. టోకెనైజేషన్ లావాదేవీలు చాలా సురక్షితం అంటున్నారు. ఈ టోకెనైజేషన్ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. అయితే కార్డుదారుడు తప్పనిసరి టోకెనైజేషన్ చేయాలన్న నియమం ఏమీలేదు. అలా వద్దనుకునేవారు ఎప్పటిలానే లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఇది కేవలం ఓ భద్రత ఫీచరు.

Tokenization1

Tokenization

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News