- Advertisement -
వరంగల్: భారతదేశం గొప్ప సహనశీల దేశమని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. అందరినీ కలుపుకుని పోయే దేశంలో విద్యేషాలకు తావులేదన్నారు. విద్వేష రాజకీయాలను యువత గ్రహించి జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. పురోగతి అనుకున్నట్లు సాగాలంటే చైతన్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కొన్ని సందర్భాల్లో చిన్న అజాగ్రత్త వల్ల తీవ్రంగా నష్టపోతామన్నారు. 1956లో చిన్న ఏమరపాటు వల్ల 60 ఏళ్లు నష్టపోయామని సిఎం గుర్తుచేశారు. ఎన్నో ప్రాణత్యాగాల తర్వాత మళ్లీ తెలంగాణ సాధించుకున్నామన్నారు. ఇప్పుడు విద్వేష రాజకీయాల నుంచి జాగ్రత్తగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని విమర్శించారు.
- Advertisement -