Monday, December 23, 2024

ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ పిటిషన్ కొట్టివేత

- Advertisement -
- Advertisement -

Dismissal of former Delhi Minister Satyendar Jain petition

న్యూఢిల్లీ : తనపై నమోదైన మనీలాండరింగ్ కేసును మరో కోర్టుకు బదిలీ చేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు శనివారం తోసిపుచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతున్న కేసును బదిలీ చేసే సమయంలో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి అన్ని వాస్తవాలను సరిగానే పరిగణన లోకి తీసుకున్నారని, ఈ నిర్ణయం చట్టవిరుద్ధం లేదంటే … జోక్యం అవసరమని భావించలేమని జస్టిస్ యోగేశ్ పేర్కొన్నారు. ఈమేరకు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు తెలిపింది. సత్యేందర్ జైన్ పిటిషన్‌ను విచారిస్తున్న ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ నుంచి మనీలాండరింగ్ కేసును ప్రత్యేక న్యాయమూర్తి వికాస్ ధుల్‌కు బదిలీ చేస్తూ. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి జస్టిస్ వినయ్ కుమార్ గుప్తా సెప్టెంబర్ 23న ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఢిల్లీ మంత్రి గత నెలలో హైకోర్టును ఆశ్రయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News